ముస్లింల పవిత్ర ప్రదేశం మక్కా మసీదు. అక్కడ సంవత్సరంలోని అన్ని రోజులు ముస్లింల తాకిడితో రద్దీగా ఉంటుంది. కానీ ఇప్పుడది బోసిపోయింది. మచ్చుకు ఒక్కరు కూడా మక్కాను సందర్శించడం లేదు. ఇదే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రాలన్నీ మనుషులు లేక ఖాళీగా ఉన్నాయి. కరోనా వైరస్ భయానికి జనం రావడం లేదు. ఇళ్లలోనే తమను తాము నిర్భందించుకుంటున్నారు. నిర్వాహకులు కూడా వాటిని మూసివేశారు. దీంతో ప్రపంచమే రెస్ట్ తీసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది పరిస్థితి..
కొన్ని సంవత్సరాలుగా జనాల తాకిడితో ఉపశమనం అనేదే లేకుండా ఉన్న ప్రదేశాలన్నీ ఇప్పుడు ఖాళీగా ఉండడం చూసి పర్యావరణ వేత్తలు తాజాగా ‘ప్రపంచం రెస్ట్ తీసుకుంది’ అని పేర్కొంటున్నారు. సౌదీ అరేబియాలోని పవిత్ర మక్కా మసీదు ప్రస్తుతం ఎడారిగా కనిపిస్తోంది. కరోనా భయంతో జనం రాక, సోకకుండా అధికారుల సైతం మక్కాను మూసివేశారు.
ఇక ఎప్పుడూ పర్యాటకులతో కళకళలాడే రోమ్ లోని వాటికన్ సిటీ చర్చి, ఇటలీలోని వెనిస్ లో ప్రసిద్ధ వెనిస్ స్క్వేర్ కూడా జనాలు లేక బోసిపోవడం ఇదే తొలిసారి అట.. ఇవేకాదు.. అమెరికాలో కర్మాగార కేంద్రమైన బోస్టన్ - టోక్కోలోని వీధులు - సువర్ణభూమి విమానాశ్రయం - బ్యాంకాక్ పర్యటక క్షేత్రాలు - పట్టాయా - థాయ్ లాండ్ లో ఖాళీ బీచులు దర్శనమిస్తున్నాయి. ఆస్ట్రేలియా - సింగపూర్ లో ఖాళీ రెస్టారెంట్లు కనిపిస్తున్నాయి. అమెరికాలో జనాలు లేని స్టేడియాలు చూస్తే కరోనాకు జనం ఎంత భయపడుతున్నారో అర్థమవుతోంది.
కరోనా మహమ్మారి ధాటికి ఇప్పుడు ప్రపంచమే విరామం తీసుకుందన్నట్టుగా పరిస్థితి తయారైందని ఆయా పర్యాటక క్షేత్రాల ఫొటోలు చూసి పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.