సౌదీలో తాజాగా నిర్మించబడిన ఒక హోటల్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఈ హోటల్ ఏ సముద్రం అడుగుభాగాన్నో - విమానంలోనో ఏర్పాటుచేసింది కాదు.. భూమిపై నిర్మించిందే కానీ.. ప్రపంచంలో ఇప్పటివరకూ ఉన్న అన్ని హోటల్లనూ వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ లో నిలవనుంది. దానికి కారణం మరేమిటో కాదు.. ఆ హోటల్ భారీ తనమే! అవును ఈ హోటల్ వంద గదులతోనో - వెయ్యి గదులతోనో కాదు.. ఏకంగా పదివేల గదులతో ఉంది. ఈ హోటల్ భారీతనం అక్కడితో అయిపోలేదు.. ఈ హోటలో ఉన్న రెస్టారెంట్ల సంఖ్య ఏకంగా 70. వినడానికి కాస్త నమ్మశక్యంగా లేకపోయినా.. ఇది అక్షరాలా నిజం. ఈ భారీ హోటల్ వచ్చే ఏడాది తొలిరోజుల్లో ప్రారంభం కానుంది.
ఈ భారీ అద్భుతమైన హోటల్ ఏదో ఒక కార్పొరేట్ కంపెనీయో లేక ఎవరైనా ప్రవేటు వ్యక్తులో నిర్మించింది కాదు. స్వయంగా సౌదీ అరేబియా ఆర్థిక శాఖే దీన్ని నిర్మించింది. ఈ హోటల్ నిర్మాణానికి డిజైన్ ఇచ్చింది అల్ - హంద్ షా గ్రూప్. ఈ హోటల్ నిర్మాణానికి అయిన ఖర్చు ఎంతో తెలుసా.. ఇంత భారీ హోటల్ నిర్మాణానికి సుమారు 3.5 బిలియన్ డాలర్లు ఖర్చయ్యింది. అన్నీ అనుకూలంగా జరిగితే 2017 లో ఈ హోటల్ అందుబాటులోకి రానుంది. సౌదీ అంటే అందరికీ గూర్తొచ్చే మక్కా కు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ భారీ నిర్మాణం కొలువు దీరింది.