ప్రాణాంతకంగా మారిన మహమ్మారి వైరస్‌కు విరుగుడు కనిపెట్టే పనిలో ప్రపంచదేశాలన్నీ తలామునకలయ్యాయి. పోటీ పడి మరి మందు కనిపెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే చాలా మందులు కనిపెట్టారు. కానీ అవి ఇంకా ప్రయోగాల దశలో ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఒకటే ఒక మందు ప్రపంచదేశాలను ఆకర్షిస్తోంది. వైరస్ కు విరుగుడుగా కనిపెట్టిన ఆ మందుపైనే ప్రజలందరూ ఆశలు పెట్టుకున్నారు. ఆ మందు వస్తే కొద్దిలో కొద్దిగా వెంటనే వైరస్ తగ్గుముఖం పడుతుందని.. ఒక భరోసాతో జీవించొచ్చని అందరూ భావిస్తున్నారు. అలా అందరి చూపులు పడిన మందును బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ది చేసిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్.
వైరస్ నివారణకు ఈ వ్యాక్సిన్ ఊపిరి పోస్తోందని అన్ని దేశాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌పై ప్రిలిమినరీ ట్రయల్స్‌లో వెయ్యి మందిపై పరీక్షలు చేయగా సత్ఫలితాలు కనిపించాయి. వారిలో 18 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయసు లోపు వారు కూడా ఉన్నారు. ఈ ఆస్ట్రాజెనెకా టీకాను ప్రయోగించిన అనంతరం వారిలో రోగ నిరోధక శక్తి గణనీయంగా పెరగడం మానవ ప్రపంచం చూపు ఈ వ్యాక్సిన్ పై పడింది. త్వరలోనే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ మరికొన్ని ప్రయోగాలు.. పరీక్షలు పూర్తి చేసుకుని మార్కెట్‌లోకి రాబోతోందని సమాచారం. అందుకే ప్రపంచ దేశాలన్నీ ఆ మందు కోసం ఎదురుచూస్తున్నాయి.
అయితే ఈ మందుకు పోటీగా చైనాకు చెందిన కాన్‌సినో బయోలాజిక్స్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ నిలుస్తోంది. అయితే ఆ మందు ఈ మందుకు కొన్ని సామీప్యతలు ఉన్నాయి. ఆక్సఫర్డ్ ఆస్ట్రాజెనెకా (AZD1222) వ్యాక్సిన్‌కు ఆ మందుకు దగ్గరి పోలికలు ఉన్నాయి. ఈ వ్యాక్సిన్‌లను జన్యుపరంగా ఇంజనీరింగ్ చేసిన వైరస్‌లతో అభివృద్ధి చేశారు. ఈ వైరస్‌లను అడెనోవైరల్ వెక్టార్స్ అని కూడా పిలుస్తారు. శరీరంలోకి వైరస్ ప్రవేశించిందని అంతర్గత వ్యవస్థలను నమ్మింపజేయడంలో ఈ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తుందని వారి వారి నివేదికల్లో పేర్కొన్నారు. దీంతో వైరస్‌తో పోరాడేందుకు శరీరంలోని కణాలు వాటి చుట్టూ స్పైక్ ప్రోటీన్లను ఏర్పరుచుకుంటాయని చెబుతున్నారు. ఈ టీకాలో చింపాంజీ అడెనోవైరస్ బలహీనమైన.. జన్యుపరంగా మార్పు చెందిన రూపంలో ఉంటుండడంతో అది మనుషులకు సోకదు. కానీ స్పైక్ ప్రోటీన్ల ఉత్పత్తిలో కీలకంగా వ్యవహరిస్తుంది.
కణాల చుట్టూ ఏర్పడిన స్పైక్ ప్రోటీన్లు శరీరంలోకి వచ్చే వైరస్‌పై అప్రమత్తతో వ్యవహరిస్తుంటాయి. వైరస్ ఇన్‌ఫెక్షన్లను గుర్తించి వాటితో పోరాడేందుకు అనుగుణంగా మన శరీరాన్ని సిద్దం చేస్తాయి. తమ వ్యాక్సిన్ పై ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు ఈ విధంగా చెబుతున్నారు. తమ వ్యాక్సిన్ ప్రయోగించిన ప్రతీ ఒక్కరిలో రోగ నిరోధక ప్రతిస్పందన మెరుగైన స్థాయిలో ఉందని తెలిపారు. శరీరంలోని T కణాలను కూడా వ్యాక్సిన్ ప్రభావం చేస్తుందని వైరస్‌తో పోరాడేందుకు ఈ వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని వివరించారు. SARS-CoV-2 ఇన్ఫెక్షన్‌ను ఎదుర్కోవడంలో T కణాలతో పాటు యాంటీ బాడీస్ కీలకంగా వ్యవహరిస్తాయని ఆ శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన నివేదికలో వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న 14 రోజుల్లో పేషెంట్లలో T కణాల సంఖ్య బాగా పెరిగినట్లు గుర్తించినట్లు చెప్పారు. వీటితో పాటు 28 రోజుల్లో యాంటీ బాడీస్ కూడా పెరిగాయంట.
ప్రస్తుతం మొదటి దశ ట్రయల్స్ విజయవంతంగా పూర్తవగా... వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే రెండో.. మూడో దశ ట్రయల్స్ కూడా పూర్తి కావాల్సి ఉంటుంది. దీనికోసం దాదాపు 10 వేల మందిపై పరీక్షలు జరపనున్నారని సమాచారం. ఆ పరీక్షల్లో సత్ఫలితాలు వస్తే 2020లోపు వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వస్తుందని ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తమకు తొందరపాటు లేదని.. వైరస్‌కు నాణ్యమైన.. సంపూర్ణంగా కోలుకునే వ్యాక్సిన్‌ను రూపొందించడమే తమ లక్ష్యమని ఆక్స్‌ఫర్డ్ ప్రతినిధులు పేర్కొన్నారు.