ఈరోజుల్లో 60 ఏళ్లు బతికితే చాలు అనుకుంటారు చాలామంది! ఎందుకంటే, సగటు జీవన ప్రమాణాలు అలా ఉన్నాయి మరి. ఎవరైనా నిండు నూరేళ్లూ బతికారని తెలిస్తే ఆశ్చర్యంగా చూస్తున్నాం. అలాంటిది ఆ పెద్దాయన వయస్సు జస్ట్ 145 సంవత్సరాలు అంటే ఆశ్చర్యం కదా! మరో ఐదేళ్లు దాటితే ఇంకో హాఫ్ సెంచరీకి దగ్గర్లో ఉన్నాడు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఇంకా పేరు నమోదు కాలేదుగానీ, బహుశా ప్రపంచంలో ప్రస్తుతం అత్యధిక వయస్కుడు ఈయనే అవుతాడు!
ఈయన పేరు ఎంబా గోథో. వయసు 145. ఇండోనేషియాలోని జావా దీవికి చెందిన పెద్దాయన ఈయన! ఎప్పుడో 1870 డిసెంబర్ 31న జన్మించాడు గోథో. ఆయన డేట్ ఆఫ్ బర్త్ ను ధ్రువీకరించేందుకు నాటి అధికారులు జారీ చేసిన ఒక గుర్తింపు కార్డు ఆయన దగ్గరుంది. ఆ ఫొటో ఐడెంటిటీ కార్డును ఇటీవలే సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో షేర్ చేశారు గోథో మనవలూ మనవరాళ్లూ. అయితే, ఐడీ కార్డును అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. ఒకసారి ఇది సరైనదే అని ధ్రువీకరించడమే ఆలస్యం... గోథో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధిస్తాడు. ప్రపంచంలోనే అత్యధిక వయస్కుడిగా, దీర్ఘాయుష్కుడిగా కూడా చరిత్ర పుటల్లో నిలిచిపోతాడు.
గోథోకి నలుగురు భార్యలు - పదిమంది పిల్లలు! చిత్రం ఏంటంటే... భార్యలూ పిల్లలూ ఎప్పుడో చనిపోయారు. ప్రస్తుతం మనవలు ఆయన్ని చూసుకుంటున్నారు. రెండో ప్రపంచ యుద్ధం జరిగే నాటికే తన వయసు 74 ఏళ్లు అని చెబుతాడు గోథో. తనకు ఇంకా ఒకే ఒక్క కోరిక ఉందనీ, అది మరణమే అని చెబుతుంటాడు గోథో.