ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కు డిసైడ్ చేసిన టీమిండియా జట్టు ఇదే

Update: 2021-06-16 10:30 GMT
క్రికెట్ అభిమానులకు పండుగ లాంటి వార్త. ఈ శుక్రవారం నుంచి సౌథాంప్టన్ వేదికగా టీమిండియా.. న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మిగిలిన టోర్నీలకు భిన్నంగా ఈ ఫైనల్ మ్యాచ్ ఎంపిక కాస్త భిన్నంగా సాగింది. ఇక.. ఈ మ్యాచ్ ఆడే టీమిండియా సభ్యుల్ని బీసీసీఐ తాజాగా వెల్లడించింది.

జట్టులో ఎవరెవరూ చోటు సాధించారన్న విషయంలోకి వెళ్లటానికి ముందు వరల్డ్ ఛాంపియన్ షిప్ కు టీమిండియా ఏ రీతిలో అర్హత సాధించిందన్న విషయాన్ని తెలుసుకోవాల్సిందే. ఐసీసీ నిబంధనల ప్రకారం షెడ్యూల్ కాలంలో ఏ జట్టు అయితే టెస్టు మ్యాచులు ఆడి.. తమ అత్యుత్తమ ప్రదర్శన ప్రదర్శిస్తే.. ఆ రెండు జట్లను ఫైనల్ కు ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో టీమిండియా ఫైనల్ కు అర్హత సాధించింది.

టీమిండియా మొత్తం ఆరు సిరీస్ ల్లో 17 మ్యాచులు ఆడితే.. అందులో 12 విజయాల్ని తన ఖాతాలో వేసుకుంటే.. నాలుగు మ్యాచుల్లో ఓడి.. ఒక మ్యాచ్ ను డ్రాగా ముగించింది. దీంతో.. టీమిండియాకు 72.2 శాతం సక్సెస్ రేట్ తో మిగిలిన జట్ల కంటే అగ్రస్థానంలో నిలిచింది. దీంతో ఫైనల్ కు చేరుకుంది. రెండో స్థానంలో న్యూజిలాండ్ జట్టు నిలిచింది. ఈ జట్టు మొత్తం ఐదు సిరీస్ లలో పాల్గొని 11 మ్యాచులు ఆడింది. మొత్తం ఏడు విజయాలు నాలుగుమ్యాచుల్ని డ్రాగా ముగించింది. దీంతో ఈ జట్టుకు 70 శాతం సక్సెస్ రేటునుసాధించింది.

దీంతో.. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ టీమిండియా - న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కు ఆడే పదిహేను మంది ఆటగాళ్లతో కూడిన జట్టున బీసీసీఐ వెల్లడించింది. జట్టులో ఎవరెవరు ఉన్నారంటే..

-  విరాట్ కోహ్లీ (కెప్టెన్)
-  అజింక్య రహానె (వైస్ కెప్టెన్)
-  రిషభ్ పంత్ (కీపర్)
-  సాహా (కీపర్)
- రోహిత్ శర్మ
- శుభమన్ గిల్
- పూజారా
- హనుమ విహారి
-  రవిచంద్రన్ అశ్విన్
-  రవీంద్ర జడేజా
-  జస్ప్రిత్ బుమ్రా
-  ఇషాంత్ శర్మ
-  మహ్మద్ షమి
-  ఉమేశ్ యాదవ్
-  మహ్మద్ సిరాజ్
Tags:    

Similar News