గద వెనుక ఇన్ని లెక్కలు ఉన్నాయి.. తేలిగ్గా తీసుకోవద్దు

Update: 2021-06-25 07:30 GMT
తొలిసారి టెస్టు క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ కు చేరుకొని జట్టును విజయతీరాలకు తీసుకెళ్లిన న్యూజిలాండ్.. గెలుపు గుర్తుగా ఇచ్చిన గదను విజయానందంగా గాల్లో ఊపిన వైనం తెలిసిందే. సాధారణంగా ఆట ఏదైనా.. టోర్నీ మరేదైనా.. విజేతకు భారీ ట్రోఫినో.. బంగారు పళ్లెం లాంటివి ఇవ్వటం చేస్తారు. అందుకు భిన్నంగా ఇలా గదను ఇవ్వటం ఏమిటి? దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? అన్నది ఆసక్తికరం. దీనికి సంబంధించిన విశేషాల్ని చూస్తే..

టెస్టు క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో విజేతగా నిలచిన న్యూజిలాండ్ క్రికెట్ టీంకు ‘గద’ను బహుమతిగా ఇవ్వటం తెలిసిందే. దీన్నిబ్రిటన్ కు చెందిన ప్రఖ్యాత ట్రోఫీ తయారీ సంస్థ థామస్ లైట్ రూపొందించింది. ఈ గదను సదరు కంపెనీకి చెందిన ట్రైవర్ బ్రౌన్ రూపొందించారు. అసలీ ‘గద’ కాన్సెప్టు ఏమిటన్న విషయాన్ని.. దాన్ని తయారీ చేసిన కంపెనీ మాటల్లో చెప్పాలంటే..హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో గెలిచిన జట్టు ఆటగాడు.. స్టంప్ ను తీసుకొని దాన్ని గాల్లోకి ఊపటంతో స్ఫూర్తి పొంది.. గదను తయారు చేశామని చెబుతోంది.

రోటీన్ కు భిన్నంగా టెస్ట్ చాంపియన్ షిప్ ట్రోఫీకి గదే అసలుసిసలైన బహుమతిగా భావించినట్లుగా ట్రోఫీ తయారు చేసిన కంపెనీ చెబుతోంది. ఈ గదకున్న మరో ప్రత్యేకత ఏమంటే.. దాన్ని యంత్రంతో కాకుండా పూర్తిగా చేతులతో తయారు చేయటం. బంగారు.. వెండి ప్లేట్లతో రూపొందించిన ఈ గద అడుగు భాగంలో గట్టి చెక్కను వినియోగించారు.

గద పిడి భాగం స్టంప్ ను పోలి ఉంటుంది. పిడి చుట్టూ బంగారు పూతతో మెలికలు తిరిగి ఉండే బ్యాండ్ గెలుపునకు నిదర్శనంగా అభివర్ణిస్తారు. గదపైన ఉంచిన క్రికెట్ బంతి.. దాని చుట్టూ ఉన్న గ్లోబ్.. ప్రపంచ క్రికెట్ కు విజేత అన్న విషయాన్ని తెలియజేసేలా దీన్ని రూపొందించారు. 
Tags:    

Similar News