సిరియాపై మిసైళ్లు వేసి, ఆప్ఘన్ లో ప్రపంచంలోనే అతి పెద్ద బాంబును ప్రయోగించి దూకుడు మీదున్న అమెరికా ఇప్పుడు నార్త్ కొరియాను చుట్టుముట్టి దానిపైనా తన బలం చూపాలని ట్రై చేస్తోంది. కాన, సిరియా - ఆప్ఘనిస్థాన్ ల్లా ఉత్తర్ కొరియా ఏమీ మొహమాటపడే రకమో... వెనక్కి తగ్గే రకమో కాదు. అమెరికా ఏమాత్రం ఎక్కువ చేసినా ఏకంగా అణుబాంబు వేసేస్తానంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాలన్నీ పోలరైజ్ అయిపోయి మరోసారి యుద్ధం వచ్చేలా ఉందని.. మూడో ప్రపంచ యుద్ధం తప్పదని భావిస్తున్నవారున్నారు. అలాంటివారి ఆలోచనలకు మరింత బలం చేకూరుస్తూ ఓ జ్యోతిష్యుడు ఏకంగా మూడో ప్రపంచ యుద్ధం ఎప్పుడు మొదలవుతుందో కూడా చెబుతున్నాడు.
హోరిసియో విలేగస్ అనే ఓ జ్యోతిష్కుడు ఈ ఏడాది మే 13వ తేదీన మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుందని చెబుతున్నాడు. పెను విధ్వంసం, అపార నష్టం, భారీ మరణాలు ఈ యుద్ధం వల్ల సంభవిస్తాయని అంటున్నాడు. ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్పడమే కాదు, ముగింపు తేదీనీ ఆయన ప్రకటించాడు. అక్టోబర్ 13న ఈ యుద్ధం ముగుస్తుందని జోస్యం చెప్పారు.
కాగా విలేగస్ జోష్యాన్ని కొందరు నమ్ముతున్నారట. అందుకు కారణం కూడా ఉంది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అవుతారని 2015లోనే విలేగస్ జోస్యం చెప్పారు. ఆయన చెప్పినట్లుగా ట్రంప్ పై ఎంత దుష్ర్పచారం జరిగినా కూడా గెలవగలిగారు. దీంతో ఆయన మాటలను లైట్ గా తీస్కోవడానికి వీల్లేదంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/