కరోనా అప్డేట్: ప్రపంచంలో 46 లక్షలు..భారత్ లో 85వేల కేసులు

Update: 2020-05-16 06:30 GMT
ప్రపంచాన్ని కరోనా వైరస్ అల్లకల్లోలం చేస్తూనే ఉంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు 213 దేశాల్లో ఈ వైరస్ ఉనికి చాటింది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.  మరణాల సంఖ్య తగ్గడం లేదు. లక్షల్లో ప్రజలు మృత్యువాత పడుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 46,28,561  కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 3,08,645 మంది ప్రాణాలు కోల్పోయారు. 17,58,080 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. అయితే ప్రపంచం లో కరోనా నుంచి కోలుకొని బయట పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఊరట కలిగిస్తోంది.

*అమెరికాలో విజృంభణ
అగ్రరాజ్యం అమెరికాను కరోనా వదలడం లేదు. కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తూనే ఉంది. అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 14,84,285కు చేరాయి. ఇప్పటివరకు కరోనాతో 88507మంది మరణించారు.

ఇక స్పెయిన్ లో 2.74 లక్షల మంది, రష్యాలో 2.62 లక్షలు, బ్రిటన్ లో 2.36 లక్షలు, ఇటలీలో 2.23 లక్షల కేసులు  నమోదయ్యాయి. బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్, ఇరాన్ , టర్కీ దేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.

*భారత్ లో 85వేలు దాటిన కేసులు.. కొత్తగా 103మంది మృతి
భారతదేశంలో కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. తాజాగా 24 గంటల్లో దేశంలో కొత్తగా 3970 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 85940కి చేరింది. గత 24 గంటల్లో 103 కరోనా వైరస్ మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2753కి చేరింది. 30152మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 53035మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

*తెలుగురాష్ట్రాల్లో..
తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో కొత్తగా 40 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1454కి చేరింది. ఇప్పటి వరకు 34మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
 
ఇక ఆంధ్రప్రదేశ్ లో నిన్న అత్యధికంగా 102 పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 2307కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 48మంది చనిపోయారు.
Tags:    

Similar News