17 ఏళ్ల తర్వాత భూమిపైకి పురుగులు.. ఎగిరి గంతులేస్తున్న అమెరికన్లు..!

Update: 2021-05-23 03:30 GMT
పర్యావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. కొన్ని జీవరాశులు కాలగర్భంలో కలిసి పోతుంటాయి. అటువంటి జీవరాశుల పరిరక్షణ కోసం పర్యావరణవేత్తలు ఎప్పటికప్పుడు కృషిచేస్తుంటారు. అయినప్పటికీ కొన్ని జీవరాశులు అంతరించిపోతుంటాయి. ఇదిలా ఉంటే అమెరికాలో 17 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన  పురుగులు  ఇప్పుడు మళ్లీ బయటకొచ్చాయట. పర్యావరణంలో చోటుచేసుకున్న మార్పులే అందుకు కారణం. అయితే ఈ పురుగులను చూసి అమెరికన్లు తెగ సంబరపడిపోతున్నారట. అందుకు కారణం ఆ పురుగులను వాళ్లు వండుకొని తింటుంటారు.

17 ఏళ్ల క్రితం ఈ పురుగులు కనిపించకుండా పోవడంతో అక్కడి ప్రజలు తెగ బాధపడిపోయారు. తాజాగా ఈ పురుగులు మళ్లీ కనిపించడంతో.. రెస్టారెంట్లలో సైతం ఇందుకు ఈ పురుగులతో పదార్థాలు చేస్తున్నారట. వీటితో చేసిన ఆహారపదార్థాలు ఎంతో రుచిగా ఉంటాయని అమెరికన్లు అంటున్నారు. మనదగ్గర దొరికే రొయ్యలలాగానే ఇవి ఎంతో రుచిగా ఉంటాయట.  

కరోనా వచ్చాక పర్యావరణంలో కాలుష్యం తగ్గిపోయిన విషయం తెలిసిందే. దాంతో ఈ పురుగులు మళ్లీ భూమిమీదకు వచ్చాయట.

తూర్పు అమెరికాలో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటిని సికాడాలు అని పిలుస్తారు. వాతావరణంలో విపరీతమైన కాలుష్యం ఏర్పడటంతో ఈ పురుగులు భూమిలోపలికి వెళ్లిపోయాయి. ఇప్పుడు కాలుష్యం తగ్గడంతో  ఈ పురుగులు మళ్లీ బయటకు వస్తున్నాయట.అయితే త్వరలోనే ఇవి మళ్లీ వెళ్లిపోతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీంతో వీటిని దొరికినప్పుడే తినేయాలని అమెరికన్లు ఆరాటపడుతున్నారట. చాలా రెస్టారెంట్లలో ఈ సికాడాలతో చేసి పదార్థాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందట.


ఈ పురుగుల్ని బ్రూడ్ ఎక్స్ లేదా బ్రూడ్ 10 అని పిలుస్తుంటారు. ఇవి భూమి అంతర్బాగంలో ఉంటాయి. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే.. భూమిని చీల్చుకుంటూ... బయటకు వస్తాయి. చెట్లు, మొక్కలపై పాకుతూ పైకి వస్తుంటాయి. గొంగళి పురుగులు సీతాకోకచిలుకల్లా మారినట్టుగానే .. ఇవి కూడా పరిణామ క్రమంలో రెక్కలు పురుగులుగా మారతాయి. కానీ ఆ లోపే వీటిని కూర వండుకొని తినేస్తున్నారు అమెరికన్లు.
ఏదేమైనా ఈ పురుగులు బయటకు రావడం పట్ల అమెరికన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారట.
Tags:    

Similar News