ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించటానికి ముందు ఎంపీగా వ్యవహరించిన యోగి ఆదిత్యనాథ్ ఏ తరహాలో వ్యాఖ్యలు చేశారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే.. యూపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు.. సంచలన స్టేట్ మెంట్లు ఇవ్వటం కాస్త తగ్గిందనే చెప్పాలి.
ఆ కొరతను తీరుస్తూ.. తాజాగా ఆయన నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి. ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాను భగ్నం చేసేందుకు.. గంగా జలాలను విషపూరితం చేయాలన్న కుట్రలు జరుగుతున్నాయన్న అనుమానాల నేపథ్యంలో యోగి నోటి నుంచి పదునైన వ్యాఖ్యలు వచ్చాయి.
మహారాష్ట్ర ఏటీఎస్ బృందం అరెస్ట్ చేసిన తొమ్మిది మంది ఐసిస్ ఉగ్రవాదులు యూపీలో ఎంటరైతే.. వారిని వెనుకా ముందు చూడకుండా మట్టుబెడతామని చెప్పారు. ఐసిస్ ఉగ్రవాదుల్ని అదుపులో తీసుకున్న మహారాష్ట్ర పోలీసుల్ని మెచ్చుకున్న యోగి.. వాళ్లు కానీ యూపీలో ప్రవేశిస్తే తక్షణమే అంతం చేస్తామని భారీగా స్టేట్ మెంట్ ఇచ్చేశారు. ఉగ్రవాదుల్ని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసన్న యోగి వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.