సెభాష్ రోజా... చాలా గ్రేట్ అనాల్సిందే..!

Update: 2022-02-11 06:41 GMT
వైసీపీ ఫైర్‌బ్రాండ్ రోజా గురించి ఇప్పుడు న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో జోరుగా చ‌ర్చ సాగుతోంది. ఆమె మాట‌ల మ‌నిషి కాద‌ని.. చేత‌ల మ‌నిషి అని అంటున్నారు. స్థానికంగా ఉన్న చిన్నారులు.. కొంద‌రు స‌రిహ‌ద్దుల్లో ఉంటున్న త‌మిళ పాఠ‌శాల‌ల్లో చ‌దువుకుంటున్నారు.

 వీరికి త‌మిళంలోనే బోధ‌న సాగుతోంది. అయితే.. ఇక్క‌డి ప్ర‌భుత్వం వారిని ప‌ట్టించుకోవ‌డం లేదు. పోనీ..వారు తెలుగు మీడియంలో చ‌దువుకుంటున్నారా ? అంటే.. అది కూడాలేదు. త‌మిళ‌నాడు విద్య‌కే వారు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే.. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఏపీలో ఉన్న త‌మిళ పాఠ‌శాల‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు.

ఇటీవ‌ల ఈ స‌మ‌స్య రోజా దృష్టికివ‌చ్చింది. దీంతో దీనిపై దృష్టి పెట్టిన రోజా.. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని వారికి హామీ ఇచ్చారు.

ఈ క్ర‌మంలో ఇటీవ‌ల రెండు రోజుల కింద‌ట‌.. త‌న భ‌ర్త సెల్వ‌మ‌ణితో క‌లిసి త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్‌ను క‌లిశారు. స్థానికంగా పిల్ల‌లు ప‌డుతున్న ఇబ్బందులను వివ‌రించారు. త‌మిళ చిన్నారుల‌కు.. పుస్త‌కాలు ఇవ్వాల‌ని.. బ్యాగులు పంపిణీ చేయాల‌ని.. త‌మిళ‌నాడులో ఎలా చూసుకుంటున్నారో.. అదేవిధంగా త‌న నియోజ‌వ‌క‌ర్గంలోని చిన్నారుల‌కు కూడా సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని కోరారు.

నిజానికి పొరుగు రాష్ట్రానికి సంబంధించిన స‌మ‌స్య‌ల విష‌యంలో ప్రభుత్వాల స్పంద‌న అంతంత మాత్రంగానే ఉంటుంది. కానీ, రోజా మాత్రం ప‌ట్టుబ‌ట్టారు. సీఎంను క‌లిసివ‌చ్చిన రెండోరోజు నుంచి సీఎంవోతో మాట్లాడ‌డం మొద‌లు పెట్టారు. రోజులో నాలుగుసార్లు స్టాలిన్ కార్యాల‌యానికి ఫోన్లు చేశారు. దీంతో ఎట్ట‌కేల‌కు.. అక్క‌డి ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించింది. త‌మిళంలో చ‌దువుతున్న ప‌ల్ల‌ల‌కు .. ఒక్కొక్క త‌ర‌గ‌తికి వెయ్యి చొప్పున పుస్త‌కాలను పంపించింది.

అంతేకాదు.. బ్యాగులు, షూస్‌తోపాటు.. త‌మిళ‌నాడు పిల్ల‌ల‌కు క‌ల్పిస్తున్న అన్ని సౌక‌ర్యాల‌ను క‌ల్పిస్తామ‌ని.. హామీ ప‌త్రాల‌ను కూడా పంపించింది. దీంతో వీటిన‌ని రోజా స్థానికంగా ఉన్న పిల్ల‌ల‌కు పంచిపెట్టారు. ఈ ప‌రిణామంతో స్థానికంగా ఉన్న‌వారు.. రోజాను మెచ్చుకోలేకుండా ఉండ‌లేక పోతున్నారు. రోజా మాట‌ల మ‌నిషికాద‌ని కొనియాడుతున్నారు.
Tags:    

Similar News