వావ్.. వాట్ ఏ వైరల్ ప్లే కార్డ్ !

Update: 2021-03-28 08:35 GMT
కరోనా సెకండ్ వేవ్ వచ్చిందని అంటున్నారు. దేశంలో మళ్లీ కేసులు విస్తృతంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో అయితే కేసులు జెట్ స్పీడులా జోరందుకున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో సర్రున ఎగబాకుతున్నాయి.

ఈ మహమ్మారి విస్తృతి తో మళ్లీ ఆంక్షలు మొదలయ్యాయి. ఇటీవలే తెలంగాణలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇచ్చేశారు. దీతో మళ్లీ విద్యాసంస్థలు మూతపడ్డాయి. చదువులు వెనకబడిపోతున్నాయి.

అయితే విద్యాసంస్థలను మూసి బార్లు, వైన్ షాపులను మాత్రం యాథావిధిగా కొనసాగించడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. తాజాగా దీనిపై మీమ్స్ సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి.

ప్రస్తుతం ఒక మహిళ పట్లుకున్న ఫ్లకార్డ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా మంది ప్రభుత్వాన్ని దీనిపై ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణలో బార్లు సహా మిగతావేం మూసివేయకుండా పాఠశాలలకే ఎందుకు తాళాలు వేశారని కొందరు నిలదీస్తున్నారు. మరికొందరు బార్ లకు వెళ్లడం స్వీయ విచక్షణ అని.. కాదని వెళ్తే వాళ్ల కర్మ అని వాదిస్తున్నారు.

అయితే బడికి వెళ్లే పిల్లల బంగారు భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అంటున్నారు. అటు ఇటూ వాదనలు వినిపిస్తున్న వేళ ఎవరికి తోచిన విధంగా వారు బార్లు - పాఠశాలలపై కరోనా వేళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News