ఒక చిన్న ఇల్లు కట్టాలంటే.. అక్కడి దాకా ఎందుకు? అంతా సిద్ధమైన డబుల్ బెడ్రూం ఇంట్లో కప్ బోర్డు చేయించటానికి ఎంత టైం తీసుకుంటారని ఏ ఒక్కరిని అడిగినా మినిమం రెండు వారాల నుంచి రెండు నెలలు పట్టే అవకాశం ఉందని చెబుతారు. మరి.. వెయ్యి పడకల పెద్దాసుపత్రి కట్టాలంటే ఎంత కాలం పడుతుందంటే? ఏళ్లకు ఏళ్లన్న మాట మన నోటి నుంచి వస్తుంది. కానీ.. చైనాలో అలా కాదు. ఇలా అనుకున్నంతనే.. అలా కట్టేసిన వైనం ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద చర్చకు తెర తీసింది. తామేం చేయాలనుకుంటే అది చేసే సత్తా చైనాకు ఎంత ఉందన్న విషయం తాజాగా మరోసారి నిరూపించింది.
అది కూడా మామూలు సమయంలో కాదు. కరోనా వైరస్ తో యావత్ దేశం అతలాకుతలమై.. ఎప్పడు ఎవరికి ఈ వైరస్ వచ్చి పడుతుందోనన్న భయం వెంటాడుతున్న వేళ.. అందుకు భిన్నంగా తొమ్మిది రోజుల రికార్డు సమయంలో వెయ్యి పడకల ఆసుపత్రిని నిర్మించి తమ సత్తా చాటారు చైనీయులు. అంతేకాదు.. ఈ భారీ ఆసుపత్రిని నిర్మించింది ఎక్కడో తెలుసా? ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ జన్మస్థానమైన వూహాన్ నగరానికి దగ్గర్లో. వూహాన్ నగరం చిన్నదేమీ కాదు. ఈ నగరంలో 1.1 కోట్లకు పైనే జనాభా నివసిస్తుంటారు.
నిత్యం రద్దీగా ఉండే రహదారులు.. మార్కెట్లతో పాటు.. హడావుడిగా ఉండే ఆ నగరం ఇప్పుడు శశ్మాన నిశ్శబ్దం ఆవరించింది. ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలంటే వణికే పరిస్థితి. ఇంతేనా.. ఇప్పటివరకూ కరోనా వైరస్ తో చనిపోయిన వారిలో ఎక్కువమంది మరణించింది కూడా వూహాన్ నగర వాసులే. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో విరుచుకుపడుతున్న కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు వీలుగా వెయ్యి పడకలతో భారీ ఆసుపత్రిని నిర్మించాలని డిసైడ్ అయ్యారు.అనుకున్నంతనే ఆసుపత్రి నిర్మాణం షురూ అయ్యింది.
సెకన్లను గంటలుగా..నిమిషాల్ని రోజులుగా.. రోజుల్ని సంవత్సరాలుగా ఫీలైనట్లుగా వాయువేగంతో పనులు చేస్తూ.. తొమ్మిదంటే తొమ్మిది రోజుల్లో భారీ నిర్మాణాన్ని పూర్తి చేశారు. అదెలా సాధ్యమైందంటే.. చైనాలో విపత్తుల సమయంలో తాత్కాలిక పునరావాసం కోసం ప్రభుత్వం ప్రీ ఫ్రాబ్రికేటెడ్ కాంక్రీట్ బ్లాక్స్ ను పెద్ద ఎత్తున సిద్ధంగా ఉంచుతుంది.
ఒకవాహనాన్ని విడి భాగాలతో కలిపి ఎలా తయారు చేస్తారో.. అచ్చం అదే రీతిలో భవనాల్ని అలానే సిద్ధం చేశారు. దేశ వ్యాప్తంగా సిద్ధంగా ఉన్న బ్లాక్ ను యుద్ధ ప్రాతిపదికన వూహాన్ కు చేర్చి.. రికార్డు సమయంలో నిర్మాణాన్ని పూర్తి చేశారు. మొత్తం 7వేల మంది కార్మికులు 24 గంటలూ పని చేసి పూర్తి చేశారు. వెయ్యికి పైగా భారీ యంత్రాలు పని చేశాయి. ఈ ఆసుపత్రిలో మొత్తం 30 ఐసీయూలతో సహా 419 వార్డులు ఉన్నాయి. 1400 మంది వైద్యులు వైద్య సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు నుంచి ఈ ఆసుపత్రిలో రోగులకు సేవలు అందించేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇదొక్కటే కాదు.. మరో 1600 పడకల ఆసుపత్రిని కూడా ఇదే రీతిలో యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తుండటం గమనార్హం. గతంలో ఈ దేశాన్ని సార్స్ మహ్మమారి విరుచుకుపడినప్పుడు కూడా ఇదే రీతిలో ఆసుపత్రుల్ని నిర్మించింది. కాకుంటే.. ఆ తర్వాత ఉద్యోగులకు.. ప్రజలకు ఇచ్చే సబ్సిడీలను కోత వేశారన్న విమర్శ వినిపిస్తూ ఉంటుంది. ఏమైనా.. ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న వేళ.. ఇంత యుద్ధ ప్రాతిపదికన నిర్మాణాల్ని పూర్తి చేసే సత్తా విషయంలో డ్రాగన్ దేశం గొప్పతనాన్ని కీర్తించక తప్పదు.