చైనా శాశ్వత అధ్య‌క్షుడిగా జిన్‌పింగ్.. అమెరికా ద‌డ‌ద‌డ‌!!

Update: 2022-09-12 09:12 GMT
మావో జెడాంగ్‌ తర్వాత చైనాలో అంతటి శక్తివంతమైన నేతగా గుర్తింపు పొందిన జిన్‌పింగ్‌.. పార్టీలో, ప్రభుత్వంలో తన అధికారాన్ని శాశ్వతం చేసుకునే దిశగా పావులు కదుపుతున్నారు. వచ్చే నెలలో జరిగే సీపీసీ ప్లీనరీ..

ఆయనకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడం సహా, రికార్డు స్థాయిలో మూడోసారి మరో ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువకాలం అధికారంలో కొనసాగేందుకు ఆమోదం తెలపనుంది. ఇది శాశ్వ‌తం అవుతుంద‌నే వాద‌న కూడా వినిపిస్తోంది.  ఈ ప‌రిణామాల‌తో అగ్ర‌రాజ్యం అమెరికా ద‌డ‌ద‌డ‌లాడుతోంది. ప్ర‌స్తుత ప్ర‌పంచ ప‌రిణామాల నేప‌థ్యంలో అమెరికాకు చైనా మ‌రింత భారంగా మారింది.

అయితే.. జిన్‌పింగ్ వెళ్లిపోతే.. కొంత వ‌రకు మేలు జ‌రుగుతుంద‌ని బైడెన్ భావిస్తున్నారు.కానీ, అలా జ‌ర‌గ‌డం లేదు. దీంతో అగ్ర‌రాజ్యం ఇప్పుడు ఆందోళ‌న‌లో ప‌డిన‌ట్టు విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇక‌, భార‌త్‌కు కూడా జిన్‌పింగ్‌తో పెద్ద త‌ల‌నొప్పులు ఉండ‌నే ఉన్నాయి. భార‌త్ కూడా చైనా పాల‌కుడు ఎప్పుడు మార‌తాడా అని ఎదురు చూస్తోంది. అయితే.. జిన్‌పింగ్ మాత్రం.. త‌నే శాశ్వ‌తంగా అధ్య‌క్ష పీఠాన్ని అధిరోహించేలా చ‌క్రం తిప్పుతున్నారు.

వచ్చేనెలలో ఐదేళ్లకోసారి బీజింగ్‌లో జరిగే చైనా కమ్యూనిస్టు పార్టీ-సీపీసీ కేంద్ర కమిటీ సమావేశాల్లో కీలక రాజ్యాంగ సవరణ చేయనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు మరిన్ని అధికారాలు కట్టబెట్టడం సహా రికార్డు స్థాయిలో మూడోసారి దేశాన్ని పాలించేందుకు మరో ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువకాలం అవకాశం లభించనుంది. త్వరలో జరిగే పార్టీ ప్లీనరీలో ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేయనున్నట్లు చైనా కమ్యూనిస్టు పార్టీ చేసిన ప్రకటన తర్వాత జిన్‌పింగ్‌ మరింత శక్తివంతమైన నేతగా ఆవిర్భవించారు.

చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన విధానాల రూపకల్పన కమిటీ 25మంది సభ్యుల పొలిట్‌ బ్యూరో సమావేశమైంది. కీలక సమయంలో జరుగుతున్న20వ చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ మహాసభలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నట్లు తెలిపింది.

కామ్రేడ్‌ జిన్‌పింగ్‌ సారథ్యంలోని సీపీసీ కేంద్ర కమిటీ గతంలో సాధించిన విజయాల ఆధారంగా మొత్తం పార్టీ, దేశ ప్రజలను ఏకం చేయటంతోపాటు దేశానికి నాయకత్వం వహించాలని సీపీసీ పొలిట్‌ బ్యూరో అభిప్రాయపడింది. ఈ ప్రకటన ద్వారా సీపీసీకి జిన్‌పింగ్‌ సారథ్యం కొనసాగుతుందని కచ్చితమైన సంకేతాలు పంపింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News