కాలం కలిసి రాకపోతే ఇలానే ఉంటుంది. అదేం దరిద్రమో టీడీపీ అధినేత చంద్రబాబు ఏ విషయాన్ని టేకప్ చేస్తే.. ఆ ఇష్యూలో ఆయనకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. జగన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు ఆయన పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు. గుడ్డ కాల్చి మీద వేయటంలో మాంచి ఎక్స్ పర్ట్ అయిన బాబు.. తనకు అలవాటైన రీతిలో నిందల బండల్ని భారీగా వేసే ప్రయత్నం చేశారు.
ఇలాంటి ప్రచారంలో భాగంగా ప్రపంచ బ్యాంకు ఏపీ రాజధాని అమరావతికి రుణం ఇవ్వనని వెనక్క వెళ్లిపోతున్న నిర్ణయం మొత్తం జగన్ పాపమేనంటూ నానా హడావుడి చేశారు. జగన్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలని ప్లాన్ చేశారు. అదేం సిత్రమో కానీ.. బాబు నోరు విప్పారో లేదో.. ప్రపంచ బ్యాంకు సైతం తాము రుణం ఇవ్వమనటానికి కారణంగా జగన్ ప్రభుత్వం కాదు.. కేంద్రమన్న విషయాన్ని చెప్పేయటంతో ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ అన్నట్లుగా మారింది.
జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీకి పెట్టుబడులు రావని.. ఆయన కారణంగా కంపెనీలు తిరిగి వెళ్లిపోతున్నట్లుగా కలర్ ఇచ్చి ప్రజల్లో కొంత భయాందోళనలు సృష్టించే చేస్తున్న వైనం గడిచిన కొద్దికాలంగా చూస్తున్నదే. దీనికి చెక్ పెట్టేలా పరిణామాలు వాటంతట అవే చోటు చేసుకుంటున్నాయి.
తాజాగా మొబైల్ దిగ్గజం షావొమి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్.. కంపెనీ ఇండియా ఎంపీ మనుకుమార్ జైన్ తాజాగా జగన్ ను కలిశారు. అనంతరం ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. అందులో జగన్ తీరును ప్రశంసల వర్షం కురిపించటమే కాదు.. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నేటి యువతకు మీరో స్ఫూర్తిగా పేర్కొనటమే కాదు.. తమ కంపెనీకి చెందిన కీలక ప్రాజెక్టును ఏపీలో స్టార్ట్ చేస్తామన్న తీపికబురును ప్రకటించారు.
ఆయన చేసిన ట్వీట్ ను యథాతథంగా చూస్తే..
‘‘జగన్ గారూ!! నేటి యువతకు మీరో స్ఫూర్తి. రాష్ట్రానికి సంబంధించి మీ విజన్‌ను పూర్తిగా విన్నాక నాలో చాలా ఉత్తేజం కలిగింది. ఇదో అద్భుతమైన సమావేశం’’ అని ఒక ట్వీట్ లో పేర్కొనగా.. మరో ట్వీట్ లో జగన్ వ్యక్తిత్వాన్ని ఉద్దేశిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆయన చాలా సింపుల్ గా - సాదాసీదాగా కనిపిస్తారు. కానీ అద్భుతమైన ఆత్మవిశ్వాసం ఉంది. ఆయన్నుంచి మేం చాలా నేర్చుకున్నాం. ఉత్తేజం పొందాం’’ అని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యల్ని చూశాక బాబు అండ్ కో నోటి నుంచి మాటలు రావేమో?
ఇలాంటి ప్రచారంలో భాగంగా ప్రపంచ బ్యాంకు ఏపీ రాజధాని అమరావతికి రుణం ఇవ్వనని వెనక్క వెళ్లిపోతున్న నిర్ణయం మొత్తం జగన్ పాపమేనంటూ నానా హడావుడి చేశారు. జగన్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలని ప్లాన్ చేశారు. అదేం సిత్రమో కానీ.. బాబు నోరు విప్పారో లేదో.. ప్రపంచ బ్యాంకు సైతం తాము రుణం ఇవ్వమనటానికి కారణంగా జగన్ ప్రభుత్వం కాదు.. కేంద్రమన్న విషయాన్ని చెప్పేయటంతో ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ అన్నట్లుగా మారింది.
ఇదిలా ఉంటే.. తాజాగా మరో బ్యాంకు సైతం ఏపీకి సాయం చేయమన్నట్లుగా తెలుగు తమ్ముళ్లు ప్రచారం చేస్తున్న వేళ.. అనూహ్యంగా ఒక ప్రముఖ కంపెనీకి చెందిన కీలక వ్యక్తి ఒకరు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలవటమే కాదు.. ఆయన విజన్ గురించి ట్వీట్ చేసిన వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.