వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం ఓవైసీ సోదరులకు అలవాటే. మైనార్టీ ముసుగులో వారు చేసే రాజకీయాలు ఎవరికి తెలియని కావు. దేశ లౌకిక వ్యవస్థ గురించి నిత్యం చాలానే కబుర్లు చెప్పే అసదుద్దీన్ ఓవైసీ బ్రదర్స్ రాజకీయ ఉపన్యాసాలు ఏ రీతిలో సాగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగేలా గతంలో వ్యాఖ్యలు చేసి.. అసదుద్దీన్ ఓవైసీ సోదరుడు జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. కరుడుగట్టిన నేరస్తుడు.. ఉగ్రవాదులతో సంబంధాలు ఉండటంతో పాటు.. వందలాది మంది మరణాలకు కారణమైన యాకూబ్ మెమన్ కు ఉరిశిక్ష తీయాలని నిర్ణయించిన నేపథ్యంలో.. యాకూబ్‌ను ఎలా ఉరి తీస్తారంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ నెల 30న అతగాడిని ఉరి తీసేందుకు ఏర్పాట్లు సాగుతుంటే.. శుక్రవారం ఉదయం ఒక కార్యక్రమంలో పాల్గొన్న అసదుద్దీన్ ఓవైసీ..యాకూబ్ మెమన్‌ను ఎలా ఉరి తీస్తారంటూ వ్యాఖ్యానించారు. ఉగ్రవాద కార్యకలపాల్లో నేరస్తుడిగా నిరూపితమై.. ఆయన చేసిన చేష్టలన్నీ ఆధారాలతో సహా బయటపడిన తర్వాత కూడా.. ఆయన తరఫున అసద్ ఏ ధైర్యంతో మాట్లాడుతున్నారు..? ముంబయి పేలుళ్లలో కీలక పాత్ర పోషించటమే కాదు.. పేలుళ్లు జరిపే వారికి కార్లను సరఫరా చేసిన ఆయన్ను అసదుద్దీన్ ఓవైసీ ఉరి తీయొద్దని ఎలా వాదిస్తారు? అంటే ఈ దేశంలో.. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు సుప్రీం కోర్టు నిర్దారించిన తర్వాత కూడా.. ఒక ప్రజాప్రతినిధి గొంతు విప్పటమే కాదు..? ఆ నిర్ణయాన్ని ప్రశ్నించటం ఏమిటి..?