ఉదయం ఒంటి గంటకే నిద్ర లేపారా?

Update: 2015-07-30 02:36 GMT
గురువారం ఉదయం 6.30 గంటల నుంచి 6.50 గంటల మధ్యలో ఉరిశిక్ష అమలు చేసిన యాకూబ్ ఉరిశిక్ష అమలు ఎప్పటి నుంచి మొదలైందన్న సమాచారం బయటకు వచ్చింది.

బుధవారం అర్థరాత్రి దాటిన గంట సేపటికి.. అంటే గురువారం తెల్లవారు జామున ఒంటి గంట సమయంలో యాకూబ్ మెమన్ ను అధికారులు నిద్ర లేపినట్లుగా చెబుతున్నారు. ఇక.. యాకూబ్ బంధువులు ఉరి అమలు చేసిన నాగపూర్ జైల్లోనే వసతి కల్పించినట్లు చెబుతున్నారు.

యాకూబ్ మెమన్ సోదరుడు సులేమాన్.. బంధువులు కొందరు బుధవారం నుంచి నాగపూర్ జైల్లోనే ఉన్నట్లు చెబుతున్నారు. యాకూబ్ మెమన్ భార్య రహిన్ మాత్రం బుధవారం రాత్రికి ముంబయి చేరుకున్నారని.. అక్కడి నుంచి గురువారం ఉదయం నాగపూర్ కు బయలుదేరినట్లుగా తెలుస్తోంది.

తన భర్త మృతదేహాన్ని తనకు అప్పగించాల్సిందిగా.. యాకూబ్ భార్య కోరనున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా ఉరి శిక్ష అమలు సమయంలో యాకూబ్ బంధువులు నాగపూర్ జైల్లోనే ఉండే సౌకర్యాన్ని అధికారులు కల్పించారు.
Tags:    

Similar News