యమునా నదిలో పడవ గల్లంతు ఘటన చోటుచేసుకుంది. దాంతో ఏకంగా ఇరవై మంది దాకా మృత్యు వాత పడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ బాందా జిల్లాలో చోటు చేసుకుంది. ఇది అత్యంత ఘోరమైన పడవ ప్రమాదంగా చెబుతున్నారు. ప్రమాద సమయాన పడవలో చాలా మంది ఉన్నారు.
అయితే ప్రమాదం జరిగిన తరువాత కొంతమంది ప్రాణాలు రక్షించుకోవడానికి ఈత కొట్టుకుని ఒడ్డుకు వచ్చేశారు. మిగిలిన వారు మాత్రం నదిలో పడి అసువులు బాసారు.
ఇక మరణించిన వారి మృత దేహాలు కొన్ని లభ్యం అయ్యాయి. అలా చాలా మృత దేహాలను బయటకు తీశారు. మిగిలిన మృత దేహాల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ దుర్ఘటన మర్కా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
ఈ దుర్ఘటన వివరాలు తెలియడంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థాలనికి చేరుకుని సహాయ చర్యలను ప్రారంభించారు.
ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా పడవలో మొత్తం యాభై మంది ప్రయాణిస్తున్నట్లుగా ప్రాధమిక వర్గాల సమాచారం. అందులో ఇరవై మంది గల్లంతు అంటున్నారు. మరి చూడాలి ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందేమో.