ఏపీ తాజా బడ్జెట్ పద్దు ఆ రాష్ట్ర అసెంబ్లీ ముందుకు వచ్చేసింది. చంద్రబాబు సర్కారు సుదీర్ఘ కసరత్తు చేసి రూపొందించిన బడ్జెట్ కు నేటి ఉదయం కేబినెట్ ఆమోద ముద్ర వేయగా... ఆ ప్రతులను సూట్ కేసులో పెట్టుకుని భద్రంగా అసెంబ్లీకి తీసుకొచ్చిన ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు... ముందుగా నిర్దేశించుకున్న ముహూర్తం మేరకే... కాసేపటి క్రితం బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా యనమల పడ్డ ఆపసోపాలు చూసి ఆయన సొంత పార్టీ నేతలే అవాక్కయ్యారు. అయినా సీనియర్ రాజకీయ వేత్తగా - పలుమార్లు బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టిన సీనియర్ మినిస్టర్ గా మెరుగైన ట్రాక్ రికార్డే ఉన్న యనమల... బడ్జెట్ ప్రసంగంలో తడబడుతూ...రాసుకొని తెచ్చుకున్న ప్రతిని కూడా సరిగ్గా చదవలేకపోయారన్న వాదన వినిపిస్తోంది.
బడ్జెట్ ప్రసంగమంటే... ఓ రేంజిలో ఉంటుందన్న ఆసక్తి అందరిలో కనిపించడం మనకు తెలిసిందే. అయితే నేటి ఉదయం యనమల చేసిన బడ్జెట్ ప్రసంగం చూస్తే మాత్రం... ఆసక్తి స్థానంలో నిర్వేదం కలగక మానదు. ఏదో తరగతి గదిలో చదువు రాని పిల్లవాడు పుస్తకం తీసుకుని పదాలను ఒత్తి ఒత్తి పలుకుతూ, కొన్ని పదాలను పలకలేక, మరికొన్ని పదాలను తప్పుగా పలుకుతూ ఆపసోపాలు పడటం అందరికీ అనుభవమే. యనమల ప్రసంగం వింటే మాత్రం అలాంటి అనుభవం మరోమారు మనకు కలగక మానదన్న వాదన లేకపోలేదు. తన ప్రసంగంలో చాలా పదాలను యలమల తప్పుగా పలకడంతో పాటు కొన్ని పదాలను పలికేందుకు నానా తంటాలు పడ్డారు. ప్రోత్సాహం అన్న పదాన్ని పలికేందుకు ఆయన పడ్డ అవస్థ చూస్తేనే... బడ్జెట్ ప్రసంగం ఎంత చప్పగా సాగిందో చెప్పొచ్చు. చాలా పదాలను ఆయన పలికే సమయంలో తప్పులు దొర్లిన సందర్భంగా వాటిని ఒకటికి పలుమార్లు ప్రస్తావించాల్సి వచ్చింది. ఇక అంకెలను ప్రస్తావించిన సమయంలోనూ యనమల నానా తంటాలు పడ్డారు.
పెట్టుబడులను సాధించామని చెప్పే బదులు... పెట్టుబడులను సంపాదించామంటూ యనమల చెప్పిన తీరు ఏమాత్రం అతకలేదనే చెప్పాలి. బడ్జెట్ ప్రసంగంలో ఆయా రాజకీయ నేతలు చెణుకులు, విరుపులు సంధిస్తుండటం మనకు తెలిసిందే. లాలూ ప్రసాద్ యాదవ్ - సురేశ్ ప్రభు - యశ్వంత్ సిన్హా - కొణిజేటి రోశయ్య - చివరకు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ... బడ్జెట్ ప్రసంగాన్ని ఏ మాత్రం మిస్ కాకూడదన్న రీతిలో జనంలో ఆసక్తి రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ తరహా ప్రసంగం చేయడంలో యనమల పూర్తిగా విఫలమయ్యారనే చెప్పాలి. యనమల బడ్జెట్ ప్రసంగం చూళ్లేమురా బాబూ అంటూ సామాన్య జనం అనుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం కాక మానదు. ఇంత చప్పగా ఏనాడూ బడ్జెట్ ప్రసంగం వినలేదన్న అసంతృప్తి కూడా వ్యక్తమైందని చెప్పక తప్పదు. నిత్యం పలికే పదాలను కూడా పలికేందుకు అవస్థలు పడ్డ యనమల పని అయిపోందన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/