యనమల మైండ్ గేమ్ షురూ.. జగన్ తర్వాత ఎవరు? అవసరమా?

Update: 2020-10-17 05:01 GMT
ప్రత్యర్థిని దెబ్బ తీయాలంటే మైండ్ గేమ్ కు మించింది మరొకటి లేదు. రాజకీయాల్లో ఇలాంటి మామూలే అయినా.. లేని విషయాల్ని ఉన్నట్లుగా భ్రమింపచేసే తీరు కొందరు నేతల్లో ఉంటుంది. అలాంటి టాలెంట్ మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడి సొంతం. సుప్రీంకోర్టు జడ్జిపై ఆరోపణలు సంధిస్తూ ఏపీ సీఎం రాసిన లేఖ సంచలనంగా మారిన వేళ.. అలా చేయటం ఎంత తప్పో తెలుసా? అన్నట్లుగా కొత్త తరహా వాదనను తెర మీదకు తీసుకొస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద చేసిన ఫిర్యాదుతో ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లుగా ఆయన మాటలు ఉండటం గమనార్హం.

భస్మాసురుడి మార్గంలో నడుస్తూ తన చెయ్యి తన నెత్తి మీదనే జగన్ పెట్టుకున్నారన్నారు. ఇప్పటికే ఉన్న 31 కేసులు సరిపోనట్లుగా అదనంగా కోర్టుధిక్కరణ కేసును కొని తెచ్చుకున్నట్లు వ్యాఖ్యానించారు. శిక్ష పడితే రాజకీయ జీవితం ముగిసిపోతుందన్న భయంతో ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో.. జగన్ పార్టీలో కొత్త చర్చ మొదలైందని.. అధినేత తర్వాత సీఎం ఎవరు? అన్న చర్చ మొదలైనట్లుగా చెప్పుకొచ్చారు.

ముఖ్యమంత్రి జగన్ ఇప్పటివరకు ప్రతిపక్షాల్ని.. శానస.. పాలనా వ్యవస్థల్ని.. అధికార యంత్రాంగాన్ని.. మీడియాను బెదిరిస్తూ వచ్చారని.. ఇప్పుడు ఏకంగా న్యాయ వ్యవస్థ మీద పడినట్లుగా మండిపడ్డారు. తన మీద ఉన్న కేసుల్లో జైలుకు వెళ్లకుండా ఉండేందుకు జగన్ ఆడుతున్న ఆటలో భాగంగానే తాజా లేఖ అంటూ యనమల మండిపడుతున్నారు. సుప్రీంకోర్టు జడ్జి మీద ఫిర్యాదు చేయటం కచ్ఛితంగా తప్పే అవుతుందని.. కోర్టు ధిక్కరణ నేరం కింద వస్తుందని పేర్కొన్నారు.

జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతో తప్పు మీద తప్పు చేస్తున్నారని.. తన భవిష్యత్తును తానే ప్రమాదంలోకి నెట్టుకుంటున్నట్లుగా వ్యాఖ్యానించారు. యనమల మాటల్ని చూస్తే.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒక ముఖ్యమంత్రి ఫిర్యాదు చేసి.. లేఖ రాయటం నేరగా రూల్ పుస్తకంలో ఎక్కడా లేదు.

అలాంటప్పుడు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి.. మరో వ్యవస్థకు చెందిన ముఖ్యుడి మీద ఫిర్యాదు చేయకూడదన్న రూల్ లేదు. ఆ మాటకు వస్తే.. యనమల వారి మాటల్ని చూస్తే.. ఎంతకు కొరుకుడుపడని జగన్ ను క్రాక్ చేసే పనిలో భాగంగా యనమల తాజా వ్యాఖ్యాలు చేసినట్లుగా చెప్పక తప్పదు. ఒకవేళ.. యనమల మాటే నిజమే అని అనుకుందాం.. అదే నిజమైతే.. లేఖ రాసిన అంశంపై ఇప్పటి వరకుసుప్రీంకోర్టు సీజే స్పందించలేదన్నది మర్చిపోకూడదు.
Tags:    

Similar News