పెద్దమనిషి తరహాలో ఉంటూ.. చిల్లర వ్యాఖ్యలు చేయకుండా.. పాయింట్ టు పాయింట్ మాట్లాడే అతికొద్ది మంది ఏపీ అధికారపక్ష నేతల్లో యనమల రామకృష్ణుడు ఒకరు. సబ్జెక్ట్ మీద అవగాహనతో పాటు.. శాసనసభా వ్యవహారాల విషయంలో తల పండిపోయిన ఆయన నోట మాట తూలటం అంటూ ఉండదు.
అలాంటి ఆయన సైతం నోరు జారటం చూసినప్పుడు.. ఏపీ అసెంబ్లీలో.. అధికార.. విపక్షాల మధ్య రచ్చ ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతుంది. బడ్జెట్ మీద చర్చ సందర్భంగా యనమల మాట్లాడుతూ.. తమను కడిగిపారేస్తామంటూ విపక్ష సభ్యులు వ్యాఖ్య చేశారని.. కానీ.. వారు సభలో లేరని.. ఉండి ఉంటే యాసిడ్‌తో కడిగి ఉండేవాళ్లమంటూ ఆయన చేసిన వ్యాఖ్య కాస్తంత ఆశ్చర్యాన్ని కలిగించక మానదు.
యనమల లాంటి నేత నోటి వెంట కూడా యాసిడ్ లాంటి మాటలు రావటమా అన్న ఆశ్చర్యం కలగకమానదు. మరోవైపు.. యనమల చేసిన యాసిడ్ వ్యాఖ్యపై విపక్ష నేత జ్యోతుల నెహ్రూ పెడర్థాలు తీయటం స్టార్ట్ చేశారు.
యనమల లాంటి వ్యక్తి నోటి వెంట అలాంటి మాటలు వినటం ఆశ్చర్యం ఉందంటూనే.. ఇలాంటి సీరియస్ వ్యాఖ్యలు యనమల చేయరని.. కానీ.. ఇప్పుడు ఆయన నోటి వెంట అలాంటి మాటలు వస్తున్నాయంటే.. ఏపీ అధికారపక్షానికి దురాలోచన ఉండి ఉండొచ్చని వ్యాఖ్యానిస్తున్నారు. సందు దొరికితే చాలు.. ఏదో రకంగా చెలరేగిపోవాలన్నట్లుందే జ్యోతుల నెహ్రూ తీరు చూస్తుంటే..?