బాబు ఘ‌న‌కీర్తి... జ‌గ‌న్ కు చిల్లిగ‌వ్వా పుట్ట‌దట‌

Update: 2019-06-18 10:37 GMT
తప్పు ఒక‌రు చేస్తే... శిక్ష మ‌రొక‌రికి ప‌డ‌ట‌మంటే ఇదేనేమో. ఆర్థిక లోటుతో ప్ర‌స్థానం ప్రారంభించిన న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ ను క‌ష్టాల క‌డ‌లిలో నుంచి గ‌ట్టెక్కిస్తానంటూ గొప్ప‌లు చెప్పుకున్న చంద్ర‌బాబు... ఆ ప‌ని చేయ‌క‌పోగా రాష్ట్రాన్ని మ‌రింత అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారు. స్థాయికి మించి అప్పులు చేసిన బాబు స‌ర్కారు... త‌మ త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కారుకు చిల్లిగ‌వ్వ అప్పు కూడా పుట్ట‌ని రీతిలో వ్య‌వ‌హారం న‌డిపారు. అదేమంటే... ఆర్థిక లోటుతో ఉన్న రాష్ట్రంలో ప్ర‌భుత్వ కార్యక‌లాపాలు సాగాలి క‌దా అనే ఓ మాట ప‌డేస్తారు. మొత్తంగా ఇప్పుడు రాష్ట్రానికి ఎక్క‌డ కూడా అప్పు పుట్ట‌ని ప‌రిస్థితికి తీసుకొచ్చారు. ఈ మాట చెప్పింది చంద్ర‌బాబు అంటే గిట్ట‌ని వారు కాదు.... స్వయానా బాబు జ‌మానాలో విత్త మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఆ పార్టీ ఎమ్మెల్సీ య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు.

నిజ‌మే నిన్న శాస‌న స‌భా స‌మావేశాల్లో భాగంగా... మండ‌లికి వ‌చ్చిన ఆయ‌న అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా య‌న‌మ‌ల త‌మ ప్ర‌భుత్వంలో సాగిన తీరును, తాము సాగించిన తీరును నిస్సిగ్గుగానే బ‌య‌ట పెట్టుకున్నారు. అస‌లు కొత్త‌గా జ‌గ‌న్ స‌ర్కారు అప్పులు తీసుకునే ప‌రిస్థితే లేదంటూ య‌న‌మ‌ల చేసిన వ్యాఖ్య‌లు నిజంగానే సంచ‌ల‌నంగా మారాయి. ఈ దిశ‌గా య‌న‌మ‌ల ఏమ‌న్నారంటే... *అప్పులు తెచ్చేందుకు ఈ ప్ర‌భుత్వానికి అవ‌కాశం లేదు. మా ప్ర‌భుత్వ హయాంలోనే బ‌డ్జెట్ లోప‌ల ప‌రిమితుల‌ను దాటి అప్పులు తేవ‌డంతో పాటు బ‌డ్జెట్ బ‌యట కూడా అప్పులు చేసేశాం. ఇక ఈ ప్ర‌భుత్వానికి అప్పు పుట్టే అవ‌కాశం కూడా లేదు* అని య‌న‌మ‌ల కాస్తంత క్లారిటీగానే తాము రాష్ట్రాన్ని ఎంత‌గా అప్పుల్లో కూరుకుపోయేలా చేసింది చెప్పేశారు.

ఆర్థిక లోటుతో ఉన్న రాష్ట్రాన్ని త‌న‌కున్న అనుభవంతో చంద్ర‌బాబు గ‌డ్డ‌న ప‌డేస్తార‌ని ప్ర‌జ‌లు అధికారం ఇస్తే... చంద్ర‌బాబు మాత్రం అందిన‌కాడికి అప్పులు చేసేసి రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బ తీశార‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రి ఇంత మేర అప్పులు చేసి కూడా జ‌రిగిన ప‌నుల‌కు కూడా బిల్లులు చెల్లించ‌కుండా దిగిపోయిన చంద్ర‌బాబు స‌ర్కారు... ఇప్పుడు త‌మ హ‌యాంలో జ‌రిగిన ప‌నుల‌కు బిల్లులు చెల్లించ‌డం లేద‌ని గ‌గ్గోలు పెడుతోంది. య‌న‌మ‌ల నోటి నుంచి ఇంత చేదు వార్త బ‌య‌ట‌కు రావ‌డానికి కూడా ఈ బిల్లుల పెండింగ్ గోలే కార‌ణమైంది. త‌మ హయాంలో జ‌రిగిన వివిధ ప‌నుల‌కు రూ.15 వేల కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉందని య‌న‌మ‌ల చెప్పారు.

ఈ బిల్లుల కోసం కాంట్రాక్ట‌ర్లు కాళ్ల‌రిగేలా తిరుగుతున్నార‌ని, అయినా జ‌గ‌న్ స‌ర్కారు బిల్లులు చెల్లించ‌డం లేద‌ని ఆయ‌న త‌న‌దైన శైలి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బిల్లుల చెల్లింపులో ఇంకా జాప్యం జ‌రిగితే... తాము న్యాస్థానాల‌ను ఆశ్ర‌యించేందుకు కూడా వెనుకాడేది లేద‌ని కూడా య‌న‌మ‌ల చెప్పారు. అయినా నిధులు లేవ‌ని, బ‌య‌టి నుంచి చిల్లిగ‌వ్వ అప్పు కూడా పుట్ట‌ద‌ని చెబుత‌న్న య‌న‌మ‌ల‌... మ‌రి గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన ప‌నుల‌కు జ‌గ‌న్ స‌ర్కారు బిల్లులు ఎలా చెల్లిస్తుందో య‌న‌మ‌లే చెప్పాల‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. మొత్తంగా త‌మ‌కు అనుకూల‌మైన కాంట్రాక్ట‌ర్ల‌కు మ‌ద్ద‌తు ప‌లికేందుకు రంగంలోకి దిగిన య‌న‌మ‌ల‌... చంద్ర‌బాబు స‌ర్కారు సాధించిన ఘ‌న‌త ఏమిటో చెప్పేశార‌న్న మాట‌.
 
Tags:    

Similar News