ఏపీలో విపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయం నానాటికీ పదును తేలుతోంది. ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించిన తర్వాతే స్పందించే జగన్... తన పార్టీ నేతలకు నిజంగానే మార్గదర్శకుడిగా నిలుస్తున్నారు. పార్టీ అధినేతగా తన పార్టీ నేతలకు ఆదర్శంగా నిలవడం కూడా ఓ గొప్పేనా అంటే... సొంత పార్టీ నేతలతో పాటు నిత్యం తనపై బురద జల్లే పార్టీ టీడీపీ నేతలకు కూడా ఆయన ఇప్పుడు మార్గదర్శకుడిగా మారారు. జగన్ వేసే ప్రతి అడుగునూ అధికార పార్టీ నేతలు అత్యంత ఆసక్తిగా గమనిస్తుండటమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. అయినా ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే... టీడీపీలో సీనియర్ నేతగానే కాకుండా, రాజకీయ వ్యూహాల్లో, పరిపాలనలో చేయి తిరిగిన నేతగా ఆ పార్టీ నేత యనమల రామకృష్ణుడు ఇప్పుడు జగన్ నామస్మరణ చేస్తున్నారు. అందుకే ఈ ప్రస్తావన చేయాల్సి వచ్చింది.
గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలో నిన్న ఉదయం వైసీపీ ప్లీనరీ సమావేశాలు అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్లీనరీలో పార్టీ అధినేతగా వైఎస్ జగన్... అధ్యక్ష్యోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు పాలన అవినీతిలో కూరుకుపోయిందని నిప్పులు చెరిగిన జగన్... చంద్రబాబు మూడేళ్ల పాలనలో ఏ మేర అవినీతి జరిగిందన్న విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. దీనికి సంబంధించి తన మాటలతోనే సరిపెట్టని జగన్... ఏకంగా ఓ బుక్కునే రిలీజ్ చేశారు. *చంద్రబాబు అవినీతి చక్రవర్తి* పేరిట విడుదల చేసిన ఆ పుస్తకంలో గడచిన మూడేళ్ల పాలనలోనే బాబు అండ్ కో ఏకంగా రూ.3.75 లక్షల కోట్లను తమ జేబుల్లో వేసుకుందని ఆరోపించారు. ఇందుకు పక్కా ఆధారాలనే వైసీపీ ఆ పుస్తకంలో పొందుపరచినట్లు సమాచారం.
ఓ వైపు ప్లీనరీలో ఈ బుక్ రిలీజ్ కాగానే... అక్కడికి కూతవేటు దూరంలోని సచివాలయంలో ఉన్న యనమల వెంటనే ప్రతిస్పందించారు. చంద్రబాబు అవినీతి చక్రవర్తి అంటూ జగన్ విడుదల చేసిన పుస్తకాన్ని ప్రస్తావించిన యనమల... తాము కూడా జగన్‌పై ఓ పుస్తకాన్ని విడుదల చేస్తామని చెప్పారు. తాము విడుదల చేసే పుస్తకంలో జగన్ చేసిన నేరాలు, ఘోరాలను ప్రస్తావిస్తామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయినా జగన్‌పై పుస్తకం వేయాలన్న ఆలోచనే రాని యనమల... ప్లీనరీలో జగన్ పుస్తకం రిలీజ్ చేయగానే ఈ పుస్తకం మాటను వల్లె వేయడం గమనార్హం. అంటే... టీడీపీ నేతలు, ప్రత్యేకించి ఆ పార్టీలో సీనియర్లుగా, రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన నేతలుగా ఉన్న యనమల లాంటి వాళ్లు కూడా జగన్ పుస్తకం రిలీజ్ చేయగానే... జగన్ మాదిరే తాము కూడా పుస్తకం రిలీజ్ చేస్తామని చెప్పడంతో మీడియా ప్రతినిధులు ఆశ్చర్యానికి గురయ్యారట.