నంద‌మూరి హ‌రికృష్ణ వీర‌భ‌క్తుడు చెప్పిన సీక్రెట్‌

Update: 2017-12-18 04:57 GMT
సాహిత్యంలో ఉద్దండుడిగా ఉన్న ఒక వ్య‌క్తి రాజ‌కీయాలు నెర‌ప‌డం అంటే అది ఒక అసాధార‌ణ విష‌య‌మే. మ‌న అంద‌రికీ యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీ ప్ర‌సాద్ బాగా ప‌రిచ‌య‌మే. కానీ ఆయ‌నను సాహితీ వేత్త కోణంలోనే చూస్తాం. కానీ ఆయన ఒక క్రియాశీల‌ రాజ‌కీయ నాయ‌కుడు కూడా అని ఇప్ప‌టికీ కొంద‌రికి తెలీదు. పాతికేళ్లుగా ఆయ‌న రాజ‌కీయాల‌తో క్రియాశీల సంబంధాల‌నే నెర‌పుతున్నారు. అయితే, ఇటీవ‌ల ఇచ్చిన ఓ ప్ర‌ముఖ ఇంట‌ర్వ్యూలో నంద‌మూరి హ‌రికృష్ణ గురించి ఆయ‌న ఒక నిజం చెప్పారు. ఎన్టీఆర్ లో ఉన్న కొన్ని లక్ష‌ణాలు ఆయ‌న‌లోనూ ఉన్న‌ట్లు ఈ  విష‌యం ద్వారా అర్థ‌మ‌వుతుంది.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే.... ఎన్టీఆర్ నుంచి చంద్ర‌బాబు చేతుల్లోకి 1995లో అధికార మార్పిడిలో సంచ‌ల‌న ప‌రిణామాలు జ‌రిగాయి. ఆ సంద‌ర్భంలో చంద్ర‌బాబుకు బాగా మ‌ద్ద‌తు ఇచ్చిన వారిలో యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీ ప్ర‌సాద్ ఒక‌రు. ఆ త‌ర్వాత ఆయ‌న రాజ్య‌స‌భ ఎంపీగా నామినేట్ అయ్యారు. అయితే, చంద్ర‌బాబే ఆయ‌న‌కు ప‌ద‌వి ఇచ్చారు అని అంద‌రూ అనుకుంటున్నారు. కానీ, చంద్ర‌బాబు యార్ల‌గ‌డ్డ‌కు ప‌ద‌వి ఇవ్వ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేద‌ట‌. ఈ విష‌యం తెలుసుకున్న హ‌రికృష్ణ ప‌ట్టుబ‌ట్టి మ‌రీ చంద్ర‌బాబును బ‌ల‌వంత పెట్టి యార్ల‌గ‌డ్డ‌కు ప‌ద‌వి ఇప్పిచ్చార‌ట‌.

ఈ సంఘ‌ట‌న‌ను గుర్తుచేసుకున్న యార్ల‌గ‌డ్డ నిజాయితీగా ప‌నిచేసి ఆనాడు చంద్ర‌బాబుకు చూపించాను. త‌ర్వాత రెండో ట‌ర్ములో చంద్ర‌బాబు హ‌రికృష్ణ‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదు. ఈ విష‌యంపై చంద్ర‌బాబును యార్ల‌గ‌డ్డ అడ‌గ్గా... *ఆయ‌న నీకు ద‌గ్గ‌రా - నాకు ద‌గ్గ‌రా...మా బావ మ‌రిది* అని కొంత చ‌ర్చ న‌డిచింద‌ని చెప్పారు. ఆయ‌న ప‌ద‌విలో లేకుండా నేను ప‌ద‌విలో ఉండ‌టం మంచిది కాదు. హ‌రికృష్ణ గారిని మంత్రిని చేయండి... నేను ఆఫీసు ఊడ్చే ఉద్యోగం చేయ‌మ‌న్నా చేస్తాను అని యార్ల‌గ‌డ్డ గ‌ట్టిగానే నిల‌దీసేట‌ప్ప‌టికి బాబుకు-యార్ల‌గ‌డ్డ‌కు మ‌ధ్య బాగా గ్యాప్ పెరిగింద‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా యార్ల‌గ‌డ్డే చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News