'నువ్వే దోచావ్.. నువ్వే దోచావ్..' వైసీపీ - టీడీపీ వాదన.. అంటే ఇద్దరూనా?

Update: 2021-03-27 14:05 GMT
దొంగే దొంగది అన్నట్టు ఏపీలో రాజకీయాల పరిస్థితి ఉందని సెటైర్లు పడుతున్నాయి.. టీడీపీ ప్రభుత్వంలో అమరావతి కుంభకోణం అంటూ ఆరోపణలు.. వైసీపీ ప్రభుత్వం విశాఖ భూముల చుట్టూ వివాదలు.. ఇలా ఎవరు అధికారంలో ఉంటే వారు రాజధానులు మార్చేయడం.. అక్కడి పరిస్థితులను 'క్యాష్' చేసుకోవడం చేస్తున్నారని పరస్పర ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో ఎవరిది నిజం.? ఎవరిని నమ్మాలన్నది జనం కన్ఫ్యూజ్ అవుతున్నారు.

'నీవు దోచావ్.. నువ్వే దోచావ్..'  వైసీపీ, టీడీపీలా వాదన అంతా ఇదేనట.. వైసీపీ వాళ్లు ఇప్పుడు ఇదే ప్రచారం చేస్తున్నారు.  అమరావతిలో పెద్ద ఎత్తున టీడీపీ వాళ్లు భూములు కొట్టేసి క్విడ్ ప్రోకో చేసి కోట్లలో పేద ప్రజలకు అన్యాయం చేశారని ఆరోపిస్తున్నారు. దీనిపై సీఐడీ విచారణకు వైసీపీ ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే.

 టీడీపీ వాళ్లు మేము దోపిడీ చేయడం లేదని కౌంటర్ ఇస్తున్నారు. 'మీరే వైజాగ్ లో పెద్ద ఎత్తున భూములు లాక్కున్నారని.. మీరే వైజాగ్ ను నాశనం చేస్తున్నారని' టీడీపీ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు.మొత్తానికి ఎవరికి దొరికిన దగ్గర వాళ్లు కొట్టేస్తున్నారని.. ప్రజలను అన్యాయం చేస్తున్నారని.. రెండు పార్టీల నేతల వాదనను బట్టి తెలుస్తోంది. ప్రజలు ఇదే భావించాలా? నిజం ఏందనేది నిగ్గు తేల్చాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. 
Tags:    

Similar News