ఆయన రాజకీయ అదృష్టవంతుడు అని అంటారు. ఆయన తన సడెన్ గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేసి ఎకాఎకిన ఎమ్మెల్యే అయిపోయారు. ఆ తరువాత కంటిన్యూ చేస్తూ టీడీపీలోకి చేరి అనకాపల్లి నుంచి ఎంపీ అయ్యారు. గిర్రున పదేళ్ళు తిరగకుండానే మంత్రి కూడా అయి తానేంటో రుజువు చేసుకున్నారు.
ఆయనే విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాసరావు. ఆయన 2009 నుంచి ఎన్నికల రాజకీయాల్లో ఉన్నారు. నాటౌట్ అని తన దూకుడుని కొనసాగిస్తున్నారు. అలాంటిది మాజీ మినిష్టర్ కాగానే అవంతికి ఇపుడు ఓటమి బెంగ పట్టుకుందా అంటే అవును అనే జవాబు వస్తోంది.
ఆయన ఫస్ట్ టైమ్ భీమిలీ నుంచి ప్రజారాజ్యం తరఫున ఎమ్మెల్యే అయ్యారు. అలా తన సేఫ్ జోన్ గా భీమిలీని చేసుకున్నారు. 2014 నాటికి అయితే ఆయన టీడీపీలో చేరినా భీమిలీ సీటు దక్కలేదు. దాంతో ఎంపీగా పోటీ చేశారు. ఇక 2019 నాటికి మాత్రం ఆ సీటు తనదే అని పట్టుబట్టారు. టీడీపీలో ఆయనకు గంటా శ్రీనివాసరావు అడ్డు వచ్చరు. దాంతో పార్టీ మారిపోయారు. వైసీపీలో చేరుతూనే మంత్రి పదవి కోసం బేరం పెట్టుకున్నారని చెబుతారు.
అలా వైసీపీ ఊపులో భీమిలీ నుంచి రెండవమారు గెలిచారు. మంత్రి కుర్చీ పట్టేసారు. ఇక మూడేళ్ళ మంత్రిత్వంలో ఆయన పెర్ఫార్మెన్స్ పెద్దగా లేదని అంటారు. ఇక ఆయనది ఒంటెద్దు పోకడ అని కూడా అంటారు. దానికి తోడు వైసీపీలో నాడు మొత్తం చక్రం విజయసాయిరెడ్డి తిప్పేసారు అని అవంతి బాధపడని రోజు లేదని చెబుతారు. ఇలా మంత్రిగా పెద్దగా ఎంజాయ్ చేయకుండానే అవంతి దిగిపోవాల్సి వచ్చింది. తీరా ఇపుడు చూసుకుంటే భీమిలీలో ఆయనకు టీడీపీ నుంచి జనసేన నుంచి కూడా గట్టి పోటీ ఎదురవుతోందిట.
ఇక్కడ జనసేనకు 2019 ఎన్నికల్లో పాతిక వేల ఓట్లు వచ్చాయీ అంటే ఆ పార్టీ ఎంత స్ట్రాంగో చెబుతోంది. అలాగే టీడీపీకి పెట్టని కోట భీమిలీ. దాంతో అవంతికి ఈ రెండు పార్టీలు కలసి పోటీ చేసినా విడిగా పోటీ చేసినా ఓటమి తప్పదు అన్న లెక్కలేవో ఉన్నాయట. దాంతోనే ఆయన తెగ మధనపడుతున్నారు అని అంటున్నారు.
అవంతికి ప్రజా ప్రతినిధిగా మంత్రిగా అవకాశం దక్కినా ఆయన చేయాల్సింది చేయలేకపోయారు అని అంటున్నారు. ఇపుడు మాజీ కాగానే తాపీగా వగచినా వాపోయినా సుఖం లేదని కూడా అంటున్నారు. మరి అవంతి బెంగ అంతకంతకు పెరిగిపోయి అంతులేని వేదనగా ఉందిట. దాంతో అవంతికి ఏం చేయాలో పాలు పోవడంలేదు అంటున్నారు. ఇలాంటి నేపధ్యంలో విశాఖ వైసీపీ ప్రెసిడెంట్ గా ఆయన పార్టీకి ఏం చేస్తారు అన్న చర్చ కూడా ఉంది. చూడాలి మరి అవంతి బెంగకు సమాధానం 2024లో ఏమి వస్తుందో.