ఏపీ అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం.. `గడపగడపకు మన ప్రభుత్వం.` ఈ కార్యక్ర మాన్ని అందరూ విజయవంతంగా నిర్వహించాలని.. పార్టీ అధినేత జగన్ ఇప్పటికే విడతల వారీగా మీ టింగులు పెట్టి మరీ.. నాయకులను హెచ్చరించారు.
దీనిలో వచ్చే మార్కులను బట్టే.. తాను టికెట్లు ఇస్తానని హెచ్చరించారు. అయితే.. మొత్తం ఏపీలో.. ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్విరామంగా నిర్వహిస్తున్న జిల్లాలు కేవలం మూడంటే మూడుమాత్రమే తేలాయని.. పార్టీ అధిష్టానానికి నివేదిక వచ్చింది.
వాటిలో అనంతపురం, చిత్తూరు, కృష్ణాజిల్లా. ఈ మూడు జిల్లాల్లోనూ.. అనంతపురంలో మాత్రమే జోరుగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతున్నట్టు వైసీపీ చేయించిన సర్వేలో.. వెల్లడైనట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. అనంతపురంలో ప్రతి ఒక్కరూ గడపగడపకార్యక్రమంలో తిరుగుతున్నారు. ఎక్కడా ఎవరూ కూడా బద్ధకించకుండా.. ప్రజలతో మమేకం అవుతున్నారు. అందుకే.. ఇప్పుడు.. ఇక్కడ నిత్యం ఎమ్మెల్యేలు.. ప్రజల మధ్య కనిపిస్తున్నారనే ఫీడ్ బ్యాక్ వస్తోందని అంటున్నారు.
ఇక, చిత్తూరుకు కూడా మంచి మార్కులే పడ్డాయని చెబుతున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకు ని. ఇక్కడవైసీపీ నాయకులు.. మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లో నడుస్తున్నారని.. ఆయన ఆదేశాల మేరకు వారు కూడా వారానికి నాలుగు రోజులు విధిగా ప్రజల మధ్య ఉంటున్నారని పార్టీ అధిష్టానానికి సర్వే రిపో ర్టు అందింది. మరోవైపు ఉమ్మడి కృష్ణాజిల్లాలోనూ గడప గడప కార్యక్రమాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. విజయవాడలోని మూడు నియోజకవర్గాలు సహా జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం హోరెత్తుతోందని అంటు న్నారు.
అయితే.. ఈ మూడుచోట్ల గడపగడప బాగానే ఉన్నా.. అనంతపురం ముందున్నా.. ఈ జిల్లాలో మాత్రం ఇబ్బందులు తప్పడం లేదని అంటున్నారు సీనియర్లు. చాలా నియోజకవర్గాల్లో నాయకుల మధ్య ఆధిపత్య పోరు పార్టీ కి ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు.
హిందూపురం నుంచి తాడిపత్రి వరకు కూడా నాయకుల మధ్య కలివిడి లేదని.. ఎవరికివారుగా ఉన్నారని.. ఇది ఎన్నికల సమయానికి సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు. అనంతపురంలో పార్టీ విజయం అత్యంత కీలకమని చెబుతున్నారు. మరి స్థానిక నేతలు ఏం చేస్తారో చూడాలి.