టిక్కెట్టేస్తున్నారు : వారిని వదిలించుకుంటారుట...?

Update: 2022-05-23 23:30 GMT
ఎవరేమనుకున్నా ఏపీలో గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా కొన్ని నగ్న సత్యాలు అందరికీ తెలిశాయి. జనాలలో దారుణమైన అసంతృప్తి పేరుకుపోయింది అన్నదే ఆ నిష్టుర స‌త్యం. అది అందరితో పాటు వైసీపీ పెద్దలకు కూడా బాగా తెలిసిందిట. అయితే ఈ కఠిన సత్యం తో పాటు మరోటి కూడా నివేదికల రూపంలో హై కమాండ్ కి చేరినది ఉంది. అదేంటి అంటే చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేల మీద జనాలలో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందని.

ఇపుడు అదే పార్టీలో జరుగుతున్న చర్చ. చాలా మంది ఎమ్మెల్యేలు మూడేళ్ళుగా ఇంటి గడప దాటలేదు. అలాగే సొంత నియోజకవర్గాలకు వెళ్ళని వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారి మీద జనాలలో ఎక్కువ వ్యతిరేకత ఉంది అంటున్నారు. అందుకే గడప గడప ప్రోగ్రాం అధినాయకత్వం డిజైన్ చేసి మరీ వారిని బయటకు పంపుతోంది అని అంటున్నారు.

ఈ విధంగా వెళ్లని వారు, జనాలను పట్టించుకోని వారు యాభై నుంచి అరవై మంది దాకా ఉన్నారని అంటున్నారు. వీరికి కనుక టికెట్లు ఇస్తే కచ్చితంగా ఓడుతారు అని అంటున్నారు. ఇక రాయలసీమ జిల్లాలలో కేవలం మూడు సీట్లు తప్ప మొత్తానికి మొత్తం వైసీపీ 2019 ఎన్నికల్లో స్వీప్ చేసేసింది. అయితే కొందరు ఎమ్మెల్యేల పోకడల వల్ల ఇపుడు అక్కడ టీడీపీ బాగా పుంజుకుంది అంటున్నారు. అదే టైమ్ లో వారిని మార్చి కొత్త వారికి టికెట్ ఇవ్వడం ద్వారా జగన్ ఇమేజ్ తో నెట్టుకురావాలని చూస్తున్నారుట.

ఇక కోస్తా జిల్లాలలో చూస్తే విజయవాడ, గుంటూర్ అర్బన్ జనాలలో వైసీపీ మీద వ్యతిరేకత బాగా పెరిగింది అని అంటున్నారు. దాంతో అక్కడ చాలాచోట్ల‌ కూడా పాతవారిని మార్చేసి కొత్త వారిని తీసుకురావాలని చూస్తున్నారుట. ఇక గోదావరి జిల్లాలలో ఫక్తు కులాల పాలిటిక్స్ ని ఎసారి చూడబోతున్నారు. దాంతో ఈ జిల్లాలలో కూడా చాలా వరకు అవతల పక్షాన్ని చూసి మరీ కులం కార్డుతో కొత్త ముఖాలను దించే పరిస్థితి ఉంది అని చెబుతున్నారు.

ఉత్తరాంధ్రాలో అయితే విశాఖ సిటీలో భారీ మార్పు చేర్పులు ఉంటాయని అంటున్నారు. మొత్తం ఆరు సీట్లలో ఈ రోజుకు చూస్తే గెలుపు అవకాశాలు బాగా తక్కువగా ఉన్నాయని అంటున్నారు. మరి ఇక్కడ కూడా టికెట్లు ఎవరికి టిక్కు పెడతారో చూడాలని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ బాగా పుంజుకుంది. దాంతో అక్కడ కూడా భారీ ఎత్తున మార్పు చేర్పులు చేయడం ద్వారా వీలైనంతవరకూ పాత వారిని వదిలించుకుని ఫ్రెష్ లుక్ తో పందెం కాయాలని చూస్తున్నారుట.

మొత్తానికి ఒక వైపు సొంత నివేదికలు, సర్వేలతో పాటు గడప గడప రిపోర్టులను కూడా బేరీజు వేసుకుంటూ వేసీపీ సీరియస్ యాక్షన్ కే దిగుతుంది అంటున్నారు. సొంత పార్టీలో కీసంగా యాభై నుంచి అరవై మంది సిట్టింగుల సీటు చిరిగిపోవడం ఖాయమని అంటున్నారు. దాంతో చాలా మంది గుండెలలో రైళ్ళు పరిగెడుతున్నాయి. మరి వారు ఇప్పటి నుంచే ఆల్టర్నేషన్ ఏర్పాట్లు చూసుకుంటారా అన్నది మరో చర్చ.

అయితే మూడవ వంతు మందికి టికెట్లు నో అంటే అది వైసీపీ విజయావకాశాల మీద విపరీతమైన ప్రచారం చూపిస్తుంది అని కూడా అంటున్నారు. మరి వైసీపీ కి మాత్రం ఇది తప్పని వ్యవహారం గా మారుతోంది అని కూడా చెబుతున్నారు. చూడాలి మరి  ఏం జరుగుతుందో.
Tags:    

Similar News