తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడి కావటం తెలిసిందే. అంచనాలకు తగ్గట్లే పాజిటివ్ ఫలితాలు అధికార పార్టీని ఆనందానికి గురి చేయగా.. విపక్షాలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా సాధించిన ఘన విజయంతో దేశంలో మరే ప్రాంతీయ పార్టీ సాధించలేని ఒక రికార్డును ఏపీ అధికారపక్షమైన వైసీపీ సొంతం చేసుకోవటం గమనార్హం.
ఏపీలోని నగర పాలక సంస్థల్లో మేయర్ పీఠాల్ని వంద శాతం అధికార పార్టీ సొంతం చేసుకోగా.. పురపాలక.. నగర పంచాయితీల్లో 96.5 శాతం స్థానాల్ని సొంతం చేసుకోవటం ద్వారా అరుదైన రికార్డుకు వైసీపీ సొంతం చేసుకున్నట్లుగా చెబుతున్నారు. తొలి విడత ఎన్నికల్లో 12 నగర పాలక సంస్థల్ని వైసీపీ సొంతం చేసుకుంటే తాజాగా నెల్లూరుతో కలిపి 13 కార్పొరేషన్లలో విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రతిపక్ష టీడీపీ దర్శి.. తాడిపత్రిలో మున్సిపాలిటీలకే పరిమితమైంది.
అయితే.. కొండపల్లి మున్సిపాలిటీలో టీడీపీ.. వైసీపీలకు సమంగా వార్డులు రావటంతో టై కావటం తెలిసిందే. టీడీపీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శిలో.. టైగా నిలిచిన కొండపల్లిలో ఓట్ల శాతం ఏ పార్టీకి ఎక్కువగా వచ్చిందన్నది చూస్తే.. అధికార వైసీపీకే కావటం గమనార్హం. దర్శిలో వైసీపీ ఓటు షేర్ 48.3 శాతం ఉంటే.. టీడీపీ షేర్ 46.57 శాతంగా ఉంది. కొండపల్లిలో వైసీపీ ఓటు శాతం 47 గా ఉంటే.. టీడీపీకి 44.17 శాతంగా ఉంది.
స్థానిక సంస్థలకు సంబంధించి గ్రామ పంచాయితీలకు నిర్వహించిన ఎన్నికల్లో 80.4 శాతం స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తం 13,092 గ్రామ పంచాయితీలకు 10,536 పంచాయితీలు అధికార వైసీపీ విజయం సాధించింది. పరిషత్ ఎన్నికల్లో ఎంపీటీసీ స్థానాల్లో 86 శాతం జెడ్పీటీసీ స్థానాల్లో 98 శాతం స్థానాల్ని అధికార వైసీపీ సొంతం చేసుకుంది. తొలిదశలో జరిగిన ఎన్నికల్లో వైసీపీకి 52.7 శాతం.. టీడీపీకి 30.67 శాతం ఓట్లు వస్తే.. రెండో దశలో జరిగిన ఎన్నికల్లో వైసీపీకి 55.7 శాతం.. టీడీపీకి 34.2 శాతం ఓట్లు రావటం చూస్తే.. ప్రజాదరణ అంతకంతకూ పెరుగుతున్న వైనం కనిపిస్తోందన్న మాట వినిపిస్తోంది.