ఏపీలో ఎమ్మెల్యేల‌ను 4 ర‌కాలుగా డివైడ్ చేస్తున్న వైసీపీ హైక‌మాండ్‌?

Update: 2022-04-20 07:30 GMT
ఏపీ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. ఇక 2024 ఎన్నిక‌ల నాటికి పొలిటిక‌ల్ డ్రామా మ‌రో స్థాయికి చేర‌డం ఖాయ‌మ‌నే అంచ‌నాలున్నాయి. అయితే రాష్ట్రంలో ఇప్ప‌టి నుంచే ఎన్నిక‌ల హీట్ మొద‌లైన‌ట్లే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. వ‌రుస‌గా రెండో సారి సీఎం కావాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న జ‌గ‌న్ ఆ దిశ‌గా క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. ఇటీవ‌ల కొత్త మంత్రివ‌ర్గాన్ని ప్ర‌క‌టించారు.

ఇక మే1 నుంచి గ‌డ‌ప గ‌డ‌ప‌కు సంక్షేమ ప‌థ‌కాలు కార్య‌క్ర‌మం మొద‌లెట్ట‌నున్నారు. మ‌రోవైపు జిల్లా అధ్య‌క్షులు, ప్రాంతీయ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు, సెంట్ర‌ల్ క‌మిటీ, రంగంలోకి దిగుతున్న పీకే టీమ్‌.. ఇలా వైసీపీ జోరు పెంచింది. ఈ నేప‌థ్యంలో అన్ని ఫిల్ట‌ర్లు చేసి ఎమ్మెల్యేల‌ను నాలుగు ర‌కాలుగా వైసీపీ విభ‌జిస్తుంద‌ని టాక్‌.

భ‌క్తితో ఉన్న‌వాళ్లు..గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ 151 సీట్లు గెలిచింది. అయితే ఆ ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలోకి జంప్ అయిన‌వాళ్లు ఎంత‌మంది అనే లెక్క ఇప్పుడు తీస్తున్నార‌ని టాక్‌. వాళ్లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీట్లు ఇస్తే గెలుస్తారో? ఒక‌వేళ గెలిచినా స్వ‌ల్ప మెజారిటీ సాధిస్తే ఇత‌ర పార్టీలోకి జంప్ అవుతారా? అన్న‌ది అధిష్ఠానం ప‌రిశీలిస్తోంద‌ని తెలిసింది.

ఇక రెండో  ర‌కం ఏమిటంటే.. వైసీపీపై భ‌క్తితో జ‌గ‌న్‌పై ఆరాధ‌న భావంతో ఉన్న ఎమ్మెల్యేలు. వీళ్లు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పార్టీ వీడే అవ‌కాశం లేదు. జ‌గ‌న్పై ఉన్న పిచ్చి అభిమాన‌మే అందుకు కార‌ణం. అందుకే మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్క‌కున్నా సైలెంట్‌గా ఉంటూ పార్టీ కోసం నిజాయితీగా ప‌ని చేసే వాళ్ల‌పై హైక‌మాండ్ దృష్టి సారించింది.

గోడ‌మీద పిల్లులు..ఇక మూడో ర‌కం ఎమ్మెల్యేలు ఎవ‌రంటే.. జ‌న‌సేన సామాజిక వ‌ర్గంలోని వాళ్లు. ఇప్ప‌టికే వైసీపీలో కాపు సామాజిక వ‌ర్గం నేత‌లు చాలా మంది ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన పొత్తు పెట్టుకుంటే ఈ వైసీపీ నేత‌లు పార్టీలో ఉంటారా? అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. వాళ్ల స్థానాల్లో ప్ర‌త్యామ్నాయాలు చూసుకోవాల్సిన అవ‌స‌రం వ‌స్తుందా? అని హైక‌మాండ్ ఆలోచ‌న‌లో ప‌డింద‌ని టాక్‌. ఒక‌వేళ ఎన్నిక‌ల‌కు ముందు స‌మ‌స్య వ‌చ్చిన‌ప్ప‌టికీ ప్ర‌త్యామ్నాయాల‌తో సిద్ధంగా ఉండాల‌న్న‌ది జ‌గ‌న్ ఆలోచ‌న‌గా తెలుస్తోంది.

ఇక నాలుగో ర‌కం.. గోడ‌మీద పిల్లులు. అవ‌కాశాన్ని బ‌ట్టి ఎటు వైపు వీళ్లు దూకుతారో తెలీదు. అలా కొంత‌మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్య‌ర్థులు ఉన్నారంటా. ఇప్ప‌టి నుంచి వాళ్ల‌ను కంట్రోల్ చేస్తూ ఆ ప్రభావం పార్టీ మీద ప‌డ‌కుండా అధిష్ఠానం జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌నుకుంటోంది. వాళ్ల‌కు నియోజ‌క‌వ‌ర్గంలో ఓట్లు లేకుండా చేసి.. ఒక‌వేళ వాళ్లు జంప్ అయినా పార్టీ న‌ష్ట‌పోకుండా చూడాల‌న్న‌ది ఆలోచ‌న‌గా తెలుస్తోంది. ఇలా నాలుగు ర‌కాలుగా ఎమ్మెల్యేల‌ను విభ‌జించి చూడాల‌ని పార్టీ ఇప్పుడు అనుకుంటోంది. మ‌రోవైపు పీకే టీమ్ ఇచ్చే నివేదిక‌ల ఆధారంగా ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News