అధికార వైసీపీ ప్రజా ప్రతినిధులే ఒకరిపై మరొకరు బూతులు తిట్టేసుకుంటున్నారు. కాకినాడలో జరిగిన డీఆర్సీ సమావేశంలో అధికార ఎంపి-ఎంఎల్ఏ మధ్య జరిగిన గొడవ చూసిన తర్వాత వైసీపీ ప్రజా ప్రతినిధులు కట్టుతప్పి పోతున్న విషయం అర్ధమైపోతోంది. డీఆర్సీ సమావేశంలో పాల్గొన్న రాజ్యసభ ఎంపి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతు టిడ్కో పథకంలో నిర్మించిన ఇళ్ళలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు.
అయితే దీనికి కాకినాడ ఎంఎల్ఏ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి జోక్యం చేసుకుని టిడ్కో ఇళ్ళలో అవినీతి అంశాన్ని ఎంపి ప్రస్తావించటం ఏమిటంటు మండిపోయారు. అవినీతి జరిగిన విషయాలు ఏమన్నా ఉంటే ముందుగా తమతో చెప్పాలే కానీ ఎంపి నేరుగా ప్రస్తావించటం ఏమిటంటూ అభ్యంతరం చెప్పారు. దాంతో పిల్లి మాట్లాడుతు తాను అవినీతి గురించి మాట్లాడితే ఎంఎల్ఏ అభ్యంతరం పెట్టడం ఏమిటంటూ నిలదీశారు. దాంతో నువ్వెంతంటే నువ్వెంత అంటూ అందరి ముందు ఇద్దరు గట్టిగా అరుచుకున్నారు.
పనిలో పనిగా సమావేశంలోనే ఉన్న టీడీపీ ఎంఎల్ఏ నిమ్మకాయల చిన్నరాజప్పపైన కూడా ద్వారపూడి నోరు పారేసుకున్నారు. అందరిపైనా నోటికొచ్చినట్లు అరిచేస్తున్న ద్వారపూడిని మంత్రి కన్నబాబు, ఇతర ఎంఎల్ఏలు సముదాయించి బయటకు తీసుకెళ్ళిపోయారు. దాంతో జరిగిన గొడవ కారణంగా సమావేశం అర్ధాంతరంగా వాయిదా పడింది. ఆమధ్య వైజాగ్ లో జరిగిన సమావేశంలో కూడా విజయసాయిరెడ్డి-ఎంఎల్ఏలు కరణం ధర్మశ్రీ, అమరనాధ్ కు మధ్య వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే.