ఆంధ్రా జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడిన చెప్పిన విధంగా అభివృద్ధి లేదు... కావాలంటే మా ప్రాంతానికి రండి చూపిస్తాం అంటున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు. సొంత శాఖ గురించి కాకుండా మాట్లాడితే చాలు విపక్షాలను తిట్టిపోసే అంబటికి ఉత్తరాంధ్రే కాదు, ఏ ప్రాజెక్టూ కనపడదా అంటున్నారు వాళ్లు. ఉత్తరాంధ్ర పథకాలకు సంబంధించి ఒక్కసారి కూడా సమీక్ష చేసే సమయం లేకుండా పోతోంది అని ఉత్తరాంధ్ర ప్రజలు, ప్రతిపక్ష నేతలు వేలెత్తిచూపుతున్నారు.
సీఎం వచ్చినపుడు (ఇప్పటికీ రెండు సార్లు వచ్చారు.. ఒకటి రెడ్డి శాంతి కుమార్తె వివాహానికి, రెండు అమ్మ ఒడి ప్రారంభానికి) నాయకుల హంగామనే తప్ప ఇక్కడి సమస్యలు గురించి విన్నవించి పరిష్కార మార్గాలు సాధించిన దాఖలాలు స్థానిక వైసీపీ నేతల్లోను లేవంటున్నారు.
తోటపల్లి ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి ఎప్పటి నుంచో నిధుల లేమి వెన్నాడుతోంది. రెండు జిల్లాలలను ప్రభావితం చేసే ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం తరఫున ఇస్తున్న నిధులు ఏవీ చాలడం లేదు అని తేలిపోయింది.
పైగా వాటికేమీ పోలవరం లాగా భారీ నిధులు అవసరం లేదు. అయినా కనీసం కాలువల నిర్వహణకు కూడా నిధులు రెండేళ్లుగా కోవిడ్ సాకుతో ఆర్థిక లేమి సాకుతో ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రాజెక్టును గాలికి వదిలేసి... నాలా వసూళ్లు మాత్రం ఆరు శాతం వడ్డీ తో కలిపి లాక్కున్నారని ఆయకట్టు ప్రజలు ఆరోపిస్తున్నారు.
తోటపల్లి ప్రాజెక్టుకు సంబంధించి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కు ఎచ్చెర్ల, లావేరు,రణస్థలం, జి.సిగడాం మండలాల్లో పిల్ల కాలువల నిర్వహణకు సంబంధించి ఇప్పటిదాకా పట్టించుకున్న దాఖలాలే లేవు. పిల్ల కాలువల పనులు పూర్తికాకపోవడంతో చెరువులపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. కొన్ని సార్లు చెరువులకు గండ్లు పడి పొలాలు నీట మునుగుతున్నాయి.
పోనీ చెరువు గండ్లు అయినా పూడుస్తున్నారా అంటే అదీ లేదు.. చెరువు పరిధిలో ఇరవై రెండు వేల ఎకరాలకు పైగా సాగవుతోంది. మొత్తం ఈ నాలుగు మండలాల్లో వెయ్యికిపైగా చెరువులు ఉన్నాయి. కనీసం ఉపాధి పథకం కింద అయినా చెరువు గండ్లు పూడ్చివేతకు, పూడికతీతకు ప్రాధాన్యం ఇస్తే బాగుండును అని కానీ ఆవిధంగా కూడా చేయడం లేదని ఆరోపణలు అన్నవి రైతుల నుంచి వినిపిస్తున్నాయి.