వ‌లంటీర్‌ల‌ను పెట్టుకుని ఏం సాధించారు? వైసీపీలో నేత‌ల మాట‌!

Update: 2022-07-17 01:30 GMT
``వ‌లంటీర్ల‌ను పెట్టారు. వారివ‌ల్ల ఏం బావుకున్నారు. వారి వ‌ల్ల అంతా న‌ష్ట‌మే. ఇటు మేం న‌ష్ట‌పోయాం. ఇప్పుడు ప్ర‌భుత్వం కూడా న‌ష్ట‌పోతోంది. మ‌రోవైపు.. పార్టీకి కూడా వారి వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేదు`` ఇదీ.. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేత‌ల మ‌ధ్య వినిపిస్తున్న మాట‌. ఎందుకంటే.. చాలా దూర దృష్టితో వ‌లంటీర్ల‌ను తీసుకువ‌చ్చామ‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారి సేవ‌ల‌ను వినియోగించుకునేందుకు అవ‌కాశం ఉంద‌ని.. ఇటీవ‌ల చాలా మంది మంత్రులు వ్యాఖ్యానించారు.

నిజానికి వలంటీర్ వ్య‌వ‌స్థ‌ను తీసుకురావ‌డం వ‌ల్ల‌... వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు, ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య అంత‌రం పెరిగిపోయింది. ఎమ్మెల్యే క‌న్నా.. వ‌లంటీర్ కే ప‌వ‌ర్స్ ఎక్కువ అనే టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యేలు సైతం వ‌లంటీర్ల ను సాయం గా పెట్టుకుని ప్ర‌జ‌ల మ‌ధ్య‌తిరుగుతున్న ప‌రిస్థితి ఉంది.

ఇక‌, వ‌లంటీర్లు.. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్తున్నారు. అయితే.. ఇప్పుడు ఇదే వ‌లంటీర్ల‌పై మంత్రులు  చేసిన వ్యాఖ్య‌లు.. పార్టీకి.. ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు కూడా ఇబ్బందిగా మారింది.

వాస్త‌వానికి వ‌లంటీర్ల‌ను ప్ర‌భుత్వం పార్టీకి సంబంధం లేద‌ని .. ఆది నుంచి చెబుతూ వ‌స్తోంది. కానీ, ఇటీవ‌ల ప‌లువురు మంత్రులు ఆవేశంలో అన్నారో.. కావాల‌నే చెప్పారో తెలియ‌దు కానీ.. వ‌లంటీర్లు కార్య‌క‌ర్త‌లే.. అని వ్యాఖ్యానించారు. దీంతో ఈ విష‌యం.. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ దృష్టికి వెళ్లింది. వేల సంఖ్య‌లో ఫిర్యాదులు అందాయి. దీంతో ఎన్నిక‌ల విధుల నుంచి వారిని త‌ప్పించేసింది. వారిని ఎట్టి ప‌రిస్థితిలోనూ ఎన్నిక‌ల విధుల్లో ఏ రూపంలోనూ వినియోగించుకోరాద‌ని ఆదేశాలు జారీచేసింది.

దీంతో వైసీపీ నేత‌లు ఇప్ప‌టి వ‌ర‌కు వ‌లంటీర్ల‌ను వినియోగించి.. ఎన్నిక‌ల్లో ల‌బ్ధిపొందాల‌ని ప‌పెట్టుకున్న ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి. ఇదే విష‌యంపై ఇప్పుడు గ్రామ‌, మండ‌ల‌, నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో చ‌ర్చ జ‌రుగుతోంది.

వ‌లంటీర్ల‌తో అటు పార్టీకి.. ఇటు త‌మ‌కు కూడా ఎలాంటి ప్ర‌యోజ‌నం లేకుండా పోయింద ని.. క‌నీసం.. కార్య‌క‌ర్త‌లుగా కూడా వారిని వినియోగించుకునే అవ‌కాశం లేకుండా.. అయిపోయింద‌ని.. వాపోతున్నారు. అస‌లు వ‌లంటీర్ వ్య‌వ‌స్థ కార‌ణంగా.. ఎవ‌రికి ప్ర‌యోజ‌న‌మ‌ని.. తాము ప్ర‌జ‌ల‌కు దూరం కావ‌డం త‌ప్ప‌! అని వారు వాపోతున్నారు. మ‌రి దీనిపై పార్టీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News