జగన్ సీమ బలిజ (కాపుల) అల్టిమేటం !

Update: 2022-07-11 11:30 GMT
అధికారం అంతా ఆ రెండు కులాల‌దే అన్న‌ది బ‌లిజ‌ల్లో గూడు క‌ట్టుకున్న ఆవేద‌న.   ఐదు రాష్ట్రాల‌లో ప్ర‌భావితం చేసే సామాజిక‌వర్గంగా ఉన్నా ప‌ద‌వుల పంపకంలో అన్యాయ‌మే సాగుతుంది అన్న‌ది వారి వాద‌న. ఇప్పుడు పార్టీల‌కు అతీతంగా అంతా ఒక్క‌టై వ‌చ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీల‌కూ చుక్క‌లు చూపిస్తాం అని అంటున్నారు. బ‌లిజ‌ల స‌భ నిన్న‌టి వేళ సీమ వాకిట జ‌రిగింది. సీఎం పార్టీకి చెందిన ప్ర‌ముఖులు కూడా ఇందులో పాల్గొని త‌మ గ‌ళం వినిపించ‌డం విశేషం.
 
జ‌గ‌న్ ముంగిట‌కు మ‌రో కుల స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. బ‌లిజ‌ల‌కు జ‌నాభా ప్రాతిప‌దిక‌న ప్రాధాన్యం ఇవ్వాల‌ని కోరుతూ ఆ సామాజిక వ‌ర్గ ప్ర‌తినిధులు ప‌ట్టుబ‌డుతున్నారు. సీమ వాకిట వారంతా నిన్న‌టి వేళ నిర‌స‌న తెలియ‌జేస్తూ ముఖ్య‌మంత్రికి అల్టిమేటం ఇచ్చారు. గ్రేట‌ర్ రాయ‌ల‌సీమ బ‌లిజ స‌మ‌న్వ‌య స‌మితి ఈ మేర‌కు ఓ తీర్మానం చేసింది.

త‌మ‌కు రావాల్సినంత గుర్తింపు రావ‌డం లేద‌ని ఆవేద‌న చెందుతూ, ప్ర‌భుత్వం త‌మ విన్న‌పాలు వినాల‌ని కోరుకుంది. తిరుప‌తి గ్రామీణ మండ‌లంలో స‌మావేశం అయి కొన్ని అపరిష్కృత  సామాజిక స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించింది.

అధికార ప‌క్షాలు అదేవిధంగా ప్ర‌తిప‌క్షాలు కూడా త‌మ‌ను చిన్న‌చూపు చూస్తున్నాయ‌ని ఆవేద‌న చెందారు ఇక్క‌డి నాయ‌కులు. ప‌ద‌వులు , అధికారం అన్న‌వి ఆ రెండు కులాల‌కేనా అన్న‌ది వారి ప్ర‌శ్న.

ముఖ్యంగా రాష్ట్రంలో రెడ్లు, క‌మ్మ‌లు మాత్ర‌మే రూలింగ్ సెక్టార్ లో ఉన్నారు అని బలిజలు (కాపులు) తరచూ ఆరోపిస్తుంటారు. మిగిలిన సామాజిక వ‌ర్గాలు పాల‌న‌లో భాగం అయినా పవర్ చేతికి రావడం లేదని వారు మా ఆవేదన అని ప్రత్యక్షంగా చెబుతున్నారు. రాయ‌ల‌సీమ‌, ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాల‌కు చెందిన తాము కేవ‌లం ఓటు బ్యాంకు రాజ‌కీయాల‌కే ప‌రిమితం అయిపోతున్నామ‌ని, తమ‌కు త‌గినంత స్థాయిలో గుర్తింపు అన్న‌ది రావ‌డం లేద‌ని వాపోయారు.

క‌నీసం నామినేటెడ్ పోస్టుల‌లో కూడా త‌మ‌కు త‌గు ప్రాధాన్యం లేద‌ని మండిప‌డుతున్నారు. జ‌నాభాలో అతి త‌క్కువ శాతం ఉన్న ఆ రెండు కులాలూ త‌మ‌కు రాజ‌కీయ ప‌ద‌వుల పేరిట భిక్ష పెట్ట‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు బలిజలు. ఈ కార్య‌క్ర‌మానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీ‌నివాసులు (చిత్తూరు) హాజ‌ర‌వడం విశేషం.
Tags:    

Similar News