విజయనగరంలో జరిగిందేంటి? చెబుతున్నదేంటి?

Update: 2022-11-14 04:48 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ప్రతి అంశాన్ని పక్కదారి పట్టించటం.. ఆయన చెబుతున్న మాటలు.. చేస్తున్న పనులు.. ఇస్తున్న హామీలు.. తుడుస్తున్న కన్నీళ్లు.. సాయాన్ని కోరే వారికి ఆపన్నహస్తం అందించేలా చేస్తున్న ఆయన తీరును తప్పు పడుతూ.. ఆయనపై విష ప్రచారం చేస్తున్న వైనం ఎక్కువైంది. తాజాగా జగనన్న ఇళ్ల భూసేకరణలో చోటు చేసుకున్న అవినీతి.. అక్రమాలను బయటపెట్టటంతో పాటు.. ఈ పథకం కింద ఎలాంటి మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారన్న విషయాన్ని బట్టబయలు చేసేందుకు జనసేనాని స్వయంగా రంగంలోకి దిగారు.

విజయనగరం జిల్లాలోని విజయనగరం మండల పరిధిలోని గుంకలాం వద్ద ఇళ్ల స్థలాల లేఔట్ నను పవన్ స్వయంగా పరిశీలించారు.  ఇక్కడ పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం జరిగినట్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతుంటే.. వాస్తవానికి అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్న విషయాన్ని బట్టబయలు చేశారు.

పవన్ చేపట్టిన ప్రోగ్రాంకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేదని.. జనాలు చాలా పలుచగా హాజరైనట్లుగా ఒక విష ప్రచారం మొదలైంది. వాట్సాప్ గ్రూపుల్లో.. సోషల్ మీడియాలో వైసీపీకి చెందిన మద్దతుదారులు కొత్త కాన్సెప్టును తెర మీదకు తీసుకొచ్చారు.

నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా? పవన్ వస్తుంటే.. ప్రజలకు కొదవా? అన్నట్లుగా ఉండే అతగాడి ఛరిష్మా మీద కొత్త సందేహాన్ని తీసుకొచ్చేలా వైసీపీ బ్యాచ్ రంగంలోకి దిగి విష ప్రచారం చేయటం షురూ చేశారు. మరి.. ఇందులోనిజం ఎంత? అన్న వషయాన్ని చెక్ చేస్తే.. పవన్ టూర్ లో జరిగిన దానికి.. వైసీపీ వర్గాలు చేస్తున్న ప్రచారానికి ఎక్కడా పొంతన లేదన్న విషయం స్పష్టమవుతుంది.

ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన లభించింది. పవన్ టూర్ కు భారీగా జనం హాజరయ్యారు. విజయనగరం జిల్లాలో అడుగుపెట్టి.. రాజాపులోవ నుంచి గుంకలాం లేఔట్ వరకు వెళ్లాల్సిన పవన్ కు.. జనం పోటెత్తటంతో దాదాపుగా మూడు గంటలు పట్టింది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సిన కార్యక్రమం.. మధ్యాహ్నం 1.20 గంటల వేళకు మొదలైంది.

దీనికి కారణం పెద్ద ఎత్తున ప్రజలు రావటంతో.. ఆయన ముందుకు అడుగు వేయటానికి ఇబ్బంది అయ్యింది. వాస్తవం ఇలా ఉంటే.. వైసీపీ మద్దతుదారుల ప్రచారం మాత్రం.. పవన్ ప్రోగ్రాం ప్లాఫ్ షోగా అభివర్ణిస్తూ పోస్టులు పెడుతున్న వైనం చూస్తే.. నిజాన్ని అసత్యపు ప్రచారంతోఎంత దారుణంగా వధిస్తారన్నది ఇట్టే అర్థమయ్యే పరిస్థితి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News