ప్లకార్డులు పట్టుకుని నిల్చోవడం... పార్లమెంటులో నాలుగు మాటలు మాట్లాడి కేంద్రాన్ని ప్రశ్నించడమే నిరసన తెలపడం అనుకుంటున్న టీడీపీ నేతలు అదేదో గొప్ప హీరోయిజం అనుకుంటూ విజయోత్సవాలు చేసుకుంటున్నారు. కానీ.. వైసీపీ నేతలు ఆదివారం అంతకుమించిన పనిచేశారు. టీడీపీ నేతలు సిగ్గుపడేలా వారు కేంద్రానికి నిరసన తెలపడం అంటే ఇలా ఉండాలి అని చూపించారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వ్యక్తి తమ ప్రాంతానికి రాగా ఆయన్ను అడ్డుకున్నారు.
కేంద్ర సహాయమంత్రి ఆర్కేసింగ్ పార్టీ పనిపై మచిలీ పట్నం రాగా అక్కడ వైసీపీ నేతలు ఆయన్ను అడ్డుకున్నారు. పార్లమెంటు నియోజకవర్గ బూత్‌స్థాయి కమిటీలతో భేటీ అయ్యేందుకు మచిలీపట్నం చేరుకున్న ఆర్కేసింగ్ ను వైసీపీ - కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే వైసీపీ - కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకుని అక్కడి నుంచి దూరంగా పంపివేశారు.
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయం - విభజన హామీల అమలు విషయమై గత కొన్ని రోజులుగా వైసీపీ నాయకులు - కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో కేంద్ర మంత్రి మచిలీ పట్నం వస్తున్నట్లు తెలియడంతో వైసీపీ నేతలు ఆయన్ను అడ్డుకున్నారు. అలా చేయడం వల్ల స్థానికంగా ఎంత ఆగ్రహం ఉందన్నది కేంద్రానికి తెలుస్తుందని వైసీపీ నేతలు అంటున్నారు. దమ్ముంటే టీడీపీ నేతలు కూడా ఇలా చేయాలని వారు అంటున్నారు.