అవమానాల మద్యే కరోనా పరీక్ష చేయించుకున్న వైసీపీ ఎమ్మెల్యే !

Update: 2020-04-27 11:30 GMT
కరోనా మహమ్మారి ..ఏపీలో రోజురోజుకి మరింత వేగంగా విజృంభిస్తుంది. గత వారం క్రితం వరకు కరోనా ఏపీలో కంట్రోల్ లోనే ఉంది అని అనుకున్నా కూడా గత నాలుగు రోజుల్లోనే కరోనా భాదితులు భారీగా పెరిగారు. ఇప్పటికే ఏపీలో కరోనా భాదితుల సంఖ్య వెయ్యి దాటిపోయింది. ముఖ్యంగా కర్నూల్ - గుంటూరు - కృష్ణా జిల్లాల్లో కరోనా భాదితులు రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతున్నారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతం అయిన విజయవాడలో కరోనా కేసులు ఊహించని విధంగా పెరిగాయి. దీనితో దాదాపుగా విజయవాడలోని 80 శాతం రెడ్ జోన్ కిందకి వచ్చేసింది.

ఇదిలా ఉంటే ..రాష్ట్రంలో కరోనాను నియంత్రణలోకి తీసుకురావాలని సీఎం జగన్ అహర్నిశలు కష్టపడుతున్నారు. అధికారులతో వరుస సమీక్షలు జరుపుతూ .. ప్రజలకి ఏ లోటు రాకుండా చూడాలని అధికారులని ఆదేశిస్తున్నారు. సీఎం రాష్ట్రంలో కరోనా కట్టడికి కోసం ఎంతగానో కష్టపడుతుంటే , వైసీపీ కి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు మాత్రం తమకి కరోనా రాదు అన్నట్టుగా ఇష్టా రీతిన ప్రవర్తిస్తున్నారు. లాక్ డౌన్ అమలు లో ఉన్నప్పటికీ కూడా కొంతమంది ప్రజాప్రతినిధులు గుంపులు గుంపులుగా ప్రజలని పోగేసుకొని భారీ ర్యాలీలు తీస్తున్నారు.

ఇలా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన ఘనకార్యాలపై చర్చ నడుస్తుండగానే ..మరో వైసీపీ మరో ఘనకార్యం చేసారు. వైసీపీ కి చెందిన ఓ ఎమ్మెల్యే కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ..భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్న విజయవాడకి వచ్చి వెళ్లారు. లాక్ డౌన్ కొనసాగుతుండగా ఇతర రాష్ట్రాలకు చెందిన మన జనాన్ని రాష్ట్రంలోకి అనుమతించకుండా క్వారంటైన్ కు పంపుతామని బెదిరిస్తున్న వైసీపీ సర్కారు.. ఈ ఎమ్మెల్యే ను మాత్రం ఏమీ అడగలేదు. విజయవాడ వెళ్లొచ్చిన పోలీసులు కానీ, జిల్లా అధికారులు కానీ ఎలాంటి ఆటంకాలు చెప్పకుండా పలాసకు పంపించారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు అంటే ..శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే అప్పలరాజు .

అయితే . విజయవాడ వెళ్లి అక్కడే కొద్దీ రోజులు ఉండి , మళ్లీ తిరిగి వచ్చాడు కానీ ,కరోనా వ్యాప్తిస్తున్న వేళ వైరస్ ప్రభావం లేని తమ జిల్లాలోకి ఎంటరైన ఈయన గారిని సొంత నియోజకవర్గంలోని విపక్ష నేతలు, అధికారులు, స్ధానిక ప్రజలు సైతం నిలదీయడం మొదలుపెట్టారు. మమ్మల్ని కరోనా పేరుతో ఇళ్లకే పరిమితం చేస్తున్న మీరు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి విజయవాడ ఎలా వెళ్లొచ్చారని ఎమ్మెల్యే అప్పలరాజును ప్రశ్నించడం మొదలుపెట్టారు. అధికారిక కార్యక్రమాలకు వెళుతున్న సమయంలోనూ అవమానాలు, ప్రశ్నలు తప్పలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి జనంలో చులకన అవుతుండడం, ఏడాది క్రితం తనకు ఓట్లేసిన సొంత నియోజకవర్గం ఓటర్లతో పాటు తాను రోజు కలిసి పనిచేయాల్సిన అధికారులు సైతం తనను అనుమానపు చూపులు చూస్తుండే సరికి ఈయన తట్టుకోలేక చివరికి ఇవాళ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే , ఫలితం వచ్చేవరకు ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, అధికారులు, స్ధానిక ప్రజలు ఎదురు చూడాల్సిన పరిస్ధితి. అయితే , మొన్నటివరకు శ్రీకాకుళం జిల్లాలో ఒక్క కరోనా కేసు లేదు ..తాజాగా మూడు కేసులు నమోదు అయ్యాయి. ఈ సమయంలో ఎమ్మెల్యే అప్పలరాజు కి కరోనా నెగటివ్ వస్తే ఇటువంటి ఇబ్బంది ఉండదు కానీ పొరపాటున పాజిటివ్ వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించడమే కష్టం.
Tags:    

Similar News