సంచలనం: కలెక్టర్ ఎదుట వైసీపీ ఎమ్మెల్యే ఆందోళన

Update: 2020-06-26 08:28 GMT
ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. ఏ పని అయినా వైసీపీ నేతలతోనే అవుతుంది.  ఆ పార్టీ ఎమ్మెల్యేలదే అంతా రాజ్యం. అలాంటి వాతావరణంలో వైసీపీ ఎమ్మెల్యే ఆందోళనకు దిగడమే పెద్ద సంచలనం.. పైగా అదీ ఒంగోలు కలెక్టర్ బంగ్లా ఎదుట.. ఈ విపరిణామానికి వైసీపీ శ్రేణులు, ప్రభుత్వం కూడా షాక్ అయ్యింది. వైసీపీ ఎమ్మెల్యేనే ఆందోళనకు దిగేంతటికి  పరిస్థితి ఎందుకొచ్చిందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో కలెక్టరేట్ ఎదుట సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆందోళనకు దిగడం సంచలనం సృష్టించింది. తన అనచరులతో కలిసి ఎమ్మెల్యే నిరసన తెలిపారు.

సంతనూతలపాడు నియోజకవర్గంలో అర్హులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం లేదంటూ  పెద్ద ఎత్తున  తన అనుచరులతో కలెక్టర్ బంగ్లా వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే నిరసన తెలిపారు. ఇళ్ల స్థలాల పంపిణీలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్ భాస్కర్ దృష్టికి ఫిర్యాదు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం పంపిణీ చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యిండి మంత్రికో.. లేక కలెక్టర్ కో ముందే సమస్యలు విన్నవించి పరిష్కరించాల్సింది పోయి ఏకంగా రోడ్డెక్కడం వైసీపీలో దుమారం రేపింది. ఈ తప్పు ఎమ్మెల్యేదా? అధికారులదా అన్నది ఇప్పుడు వైసీపీ అధిష్టానం ఆరాతీస్తున్నట్టు తెలిసింది.
Tags:    

Similar News