వైసీపీ ఎమ్మెల్యే అనుచరుల బరి తెగింపు.. టోల్ ప్లాజా సిబ్బందిపై కర్రలతో దాడి
ఇప్పటికే ఏపీలో వైసీపీ ప్రజాప్రతినిధుల అనుచరుల ఆగడాలు శ్రుతి మించుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఎంపీ, ఎమ్మెల్యే పేరు చెప్పుకుని అనుచరులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులు ఏకంగా టోల్ ప్లాజా సిబ్బందిపై కర్రలతో దాడికి దిగడం తీవ్ర సంచలనంగా మారింది.
కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమకతాడు టోల్‌ప్లాజా వద్ద ఎమ్మెల్యే శ్రీదేవి వాహనం వెళ్లాక తమ వాహనాలను అనుమతించకపోవడంతో అనుచరులు ఆగ్రహానికి గురయ్యారు.
ఎమ్మెల్యే అనుచరుల కారును ఆపుతారా? అంటూ అక్కడ ఉన్న సిబ్బందిపై వాళ్లు కర్రలతో దాడికి దిగారు. వీళ్లలో ఎమ్మెల్యే అనుచరుడు సంజీవ్ రెడ్డితో పాటు మరికొంతమంది ఉన్నట్లు సమాచారం. దాడి దృశ్యాలు టోల్‌ప్లాజాలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
అయితే ఈ సీసీ టీవీ ఫుటేజీ పాతదని ఎమ్మెల్యే అనుచరులు చెబుతున్నారు. శ్రీదేవికి మంత్రి పదవి వస్తుందనే అక్కసుతో దుష్ప్రచారం చేసేందుకు కుట్ర చేశారని ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే అనుచరుల దాడిపై టీడీపీ మండిపడింది.
ఏపీలో వైసీపీ శ్రేణుల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయని టీడీపీ విమర్శించింది. ఎమ్మెల్యే అనుచరుల వాహనాన్ని అనుమతించలేదని ఏకంగా టోల్‌ప్లాజా సిబ్బందిపైనే దాడి చేసి భయబ్రాంతులకు గురి చేశారని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక గతంలో కూడా ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులు చేసిన కొన్ని చర్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.
ఎమ్మెల్యే అనుచరులు భారీ స్థాయిలో భూకబ్జాలకు పాల్పడ్డారని తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడికి ఈ టోల్ ప్లాజా సిబ్బందిపై దాడితో వాళ్ల అరాచకం మరోసారి బయటపడిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.