గడిచిన ఏపీ ప్రభుత్వ పాలనలో.. ప్రధానంగా రాష్ట్రంలోని ప్రకృతి ప్రసాదమైన మైనింగ్ ను టీడీపీ నేతలు చెరబెట్టి దోపిడీ చేశారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ఆరోపించింది. ఇసుక- గ్రానైట్- విశాఖ మన్యంలో బాక్సైట్ ఇలా టీడీపీ నేతలే దోపిడీకి సూత్రధారులని ఆరోపణలు చేసింది. ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా మైనింగ్ ను ఆపు చేయించింది. వాగులు- వంకల్లో ఇసుక తవ్వకాలపై నిషేధం విధించింది.
అయితే రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొడుతున్నారని అసెంబ్లీలో సభ దృష్టికి వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా గత టీడీపీ పాలనలో కృష్ణా నదిలోని ఇసుకను దోచుకున్న తీరును ఆయన ఎండగట్టారు. గత టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా ఇసుకను దోచుకున్నారని.. టీడీపీ నేతల పొట్టొల్లో ఇసుక ఉందని.. దానిని కక్కిస్తే రాష్ట్రంలో ఇసుక కొరత తీరుతుందని ఆయన సంచలన కామెంట్స్ చేశారు.
దీనిపై సమాధానం ఇచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఇసుక మాఫియా నుంచి ఇసుకను కాపాడేందుకు కొత్తగా సమగ్ర విధానాన్ని తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇక ఆర్థిక మంత్రి బుగ్గన కూడా స్పందించారు. సరైన సమగ్ర విధానంలో ఇసుకను క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇసుక, మైనింగ్ ను టీడీపీ నేతలు సంపాదనగా మార్చుకున్నారని.. ఇక నుంచి పారదర్శకమైన నిబంధనలు ఖరారు చేయబోతున్నట్టు తెలిపారు.