జస్టిస్ చంద్రు కామెంట్ల ఆ వైసీపీ ఎంపీ షాకింగ్ కామెంట్లు

Update: 2021-12-13 10:30 GMT
గత రెండు రోజులుగా ఏపీలో మద్రాసు హైకోర్టు మాజీ జస్టిస్ చంద్రు పేరు మార్మోగిపోతోన్న సంగతి తెలిసిందే. జై భీమ్ చిత్రంలో సూర్య నటించిన పాత్రకు ఇన్ స్పిరేషన్ అయిన రిటైర్డ్ జస్టిస్ చంద్రు గారి పేరు గతంలో గొప్పగా మార్మోగింది. కానీ, తాజాగా మాత్రం ఇటీవల న్యాయవ్యవస్థపై రిటైర్డ్ జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై విమర్శలు వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వానికి న్యాయవ్యవస్థ అడ్డుపడుతోందనే అర్థం వచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.

ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. రిటైర్డ్ జస్టిస్ చంద్రు గురించి తాను కూడా జై భీమ్ సినిమా చూసి గొప్పగా ఊహించుకున్నానని ఆయన అన్నారు. కానీ, ఏపీలో న్యాయ వ్యవస్తపై రిటైర్డ్ జస్టిస్ చంద్రు కామెంట్లు విన్న తర్వాత ఆ అభిప్రాయం మార్చుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఏపీలో జరుగుతున్న పరిస్థితుల గురించి అవగాహన లేకుండా ఆయన మాట్లాడారని అన్నారు.

ఓ తలపాగా పెట్టి షాలువా కప్పినందుకు ప్రభుత్వానికి అనుకూలంగా వారు మాట్లాడిన మాటలు వింటే నవ్వొచ్చిందని, కానీ, అదే సమయంలో ఇక్కడ పరిస్థితులు తెలుసుకోకుండా ఆయన మాట్లాడారిన బాధేసిందని అన్నారు. జై భీమ్ సినిమాతో గొప్ప ఇమేజ్ క్రియేట్ చేసుుకున్న న్యాయమూర్తితో ఆ ఒక్క స్టేట్ మెంట్ ఇప్పించి ఆయన పరువు బజారుకీడ్చిన ఘనత తమ పార్టీ నేతలదేనని ఎద్దేవా చేశారు.

వైసీపీ నేతలను మెచ్చుకోవాలో,  రిటైర్డ్ జస్టిస్ చంద్రుకు రాజ్యాంగంపై ఉన్న పట్టును చూసి నొచ్చుకోవాలో అర్థం కావడం లేదన్నారు. శాసన సభ చట్టం చేస్తే న్యాయస్థానం పాటించాలన్నరీతిలో ఆయన మాట్లాడారని, రాజ్యాంగం, అధికరణాలకు అతీతంగా ప్రభుత్వం వ్యవహరిస్తే హైకోర్టు, సుప్రీం కోర్టు ఆ చట్టాలను కొట్టేయొచ్చని అన్నారు. ఇది ఎక్కడైనా జరిగేదేనని, ఇందులో పక్షపాతం ఉండదని వెల్లడించారు.

అయితే, కీ ఇచ్చిన చిలుకలాగా ఆ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడినందుకు ఆయన స్థాయిని ఆయనే తగ్గించుకున్నందుకు బాధపడుతున్నానని , ఆయన్ను ఈ స్థాయికి దిగజార్చిన వైసీపీ నాయకత్వానికి, జగన్ కు హ్యాట్సాఫ్ చెబుతున్నానని అన్నారు. న్యాయవ్యవస్థలను వేరేవాళ్లతో తిట్టించారని, వారిని జైల్లో పెట్టారని, చివరకు న్యాయవ్యవస్థను ఎస్సీ న్యాయమూర్తితో తిట్టిస్తే ఇబ్బంది ఉండదన్న పన్నాగాన్ని పన్నారని ఆరోపించారు. ఏది నిజమో నిర్ణయించుకోవాలని ప్రజలను కోరుతున్నానన్నారు.
Tags:    

Similar News