ఏపీలో 2024 ఎన్నికలు కచ్చితంగా చాలా ఇంటరెస్ట్ గానే సాగుతాయి అని చెప్పాలి. నిజానికి ఎన్నికలు అంటేనే ఆసక్తి ఉత్సాహాం వేరే లెవెల్ లో ఉంటుంది. కానీ దేశంలో ఏ రాష్ట్రానికి లేనంత పొలిటికల్ హైప్, ఉత్సుకత ఏపీలో 2024లో జరగబోయే ఎన్నికలకు ఉండబోతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ని దెబ్బ తీయడానికి ముందూ వెనక శక్తులు అన్నీ ఒక్కటి కాబోతున్నాయి. ఇక కుడి ఎడమల తేడా లేకుండా రాజకీయం కూడా రంజుగా సాగనుంది.
ఇవన్నీ పక్కన పెడితే వైసీపీ ఎంపీ రఘురామక్రిష్ణం రాజు అయితే వచ్చే ఎన్నికలలో రాజకీయ వెండి తెర మీద తనదైన సినిమా ఏంటో చూపిస్తాను అంటున్నారు. అంతవరకూ ఆగి ఆ సినిమా చూసి తీరాల్సిందే అంటున్నారు. ఇపుడే అదేంటి అన్నది చెప్పలేనని అంటున్నారు, అయితే కచ్చితంగా ఏపీ ఎన్నికల్లో తన పాత్ర చాలా చాలా కీలకంగా మారబోతుంది అని ఆయన చెబుతున్నారు. జగన్ అంటే పూర్తిగా వ్యతిరేకిస్తున్న రఘురామక్రిష్ణం రాజు ఆయన్ని ఓడించి మాజీ సీఎం గా చూడడమే లక్ష్యంగా పెట్టుకున్న సంగతి విధితమే.
దాంతో పాటు జగన్ బెయిల్ రద్దు చేయాలని కూడా ఆయన కోర్టులకు ఎక్కారు. ఇక ప్రతీ రోజూ డైలీ సీరియల్ మాదిరిగా రచ్చబండ ఢిల్లీలో పెట్టి జగన్ మీద విమర్శలు వీర లెవెల్ లో చేయడం రఘురామకే చెల్లింది. ఇవన్నీ కాదు అసలు సినిమా ముందుంది అని ఆయన అంటే అది కచ్చితంగా చాలా ఆసక్తికరమే అని చెప్పాలి. తాను ఏ విధంగా కీలకపాత్ర పోషిస్తానో చూడండి అంటూ ఒక యూట్యూబ్ చానల్ లో రఘురామరాజు మాట్లాడిన మాటలు ఇపుడు తెగ వైరల్ అవుతున్నాయి.
ఒకనాడు తాను జగన్ కోసం సీబీఐలోనే స్టింగ్ ఆపరేషన్ నిర్వహించానని, దానికి కారణం తాన మిత్రుడు వైఎస్సార్ కుమారుడు అన్న అభిమానమే అని రఘురామ చెప్పుకున్నారు. వైఎస్సార్ చనిపోయాక జగన్ని అందరూ కలసి ట్రబుల్స్ పెడుతున్నారని అనాడు తాను బాధపడి ఆయన పక్షం వహించానని ఫ్లాష్ బ్యాక్ సీన్ ఒకటి చెప్పారు. అయితే ఇదే జగన్ చివరికి తనకే ట్రబుల్స్ తెస్తారని ఏనాడు ఊహించలేదని ఆయన వాపోయారు.
ఈ రోజు జగన్ వద్ద వైఎస్సార్ కి క్లోజ్ గా ఉన్న వారు ఎవరూ లేరని ఆయన చెప్పడం ఇక్కడ విశేషం. వైఎస్సార్ ని ద్వేషించిన వారు, జగన్ని దారుణంగా తిట్టిన వారే ఇపుడు ఆయనతో ఉంటున్నారని రఘురామ పేర్కొన్నారు. అందుకే వైఎస్సార్ మిత్రులు ఉండవల్లి అరుణ్ కుమార్, కేవీపీ రామచంద్రరావు లాంటి వారు జగన్ వైపు లేరని ఆయన అన్నారు.
మొత్తానికి జగన్ ఓటమిని గట్టిగా కోరుకుంటున్న రాజు గారు అసలైన సినిమా 2024లోనే రిలీజ్ చేస్తానని, దాని దెబ్బకు వైసీపీ పెద్దలకు చుక్కలు కనిపించాల్సిందే అంటున్నారు. మరి రాజు గారి సినిమా ఎలా ఉంటుందో ఆయన ఏపీ ఎన్నికల్లో పోషించే కీలక పాత్ర ఏంటి అన్నది తెలుసుకోవాలంటే మరో రెండున్నర ఏళ్ల పాటు వేచి చూడాల్సిందే.