ర‌ఘురామ‌కు షాక్ ఇచ్చిన వైసీపీ ఎంపీలు.. కేంద్రం ముందు సంచ‌ల‌న డిమాండ్‌..!

Update: 2021-12-06 11:56 GMT
నరసాపురం వైసిపి రెబెల్ ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణం రాజుకు వైసిపి ఎంపీలు షాక్ ఇచ్చారు. ఈరోజు లోక్ సభ వేదికగా రఘురామకృష్ణంరాజు వ‌ర్సెస్ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి మధ్య పెద్ద మాటల యుద్ధం నడిచింది. ముందుగా సోమవారం జీరో అవర్లో మాట్లాడిన రఘురామ న్యాయస్థానం దేవస్థానం పేరుతో అమరావతి రైతులు రాజధాని కోసం పాదయాత్ర చేస్తున్నారంటూ కొనియాడారు. ఈ మహా పాదయాత్రను పోలీసులు అడ్డుకోవటం అన్యాయమని ఆయన విరుచుకుపడ్డారు.

ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీలు రఘురామ ప్రసంగానికి అడ్డుతగిలారు. అమరావతి రైతుల పాదయాత్రకు ఓవైపు హైకోర్టు నుంచి కూడా అనుమతులు ఉన్నాయని... రాజధాని రైతులు అమ‌రావ‌తి కోసం 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని.. అయితే ఇప్పుడ వారు పాద‌యాత్ర చేస్తుంటే వారిని పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిధిలో ఉన్నా కూడా శాంతించాయ‌ని.. క‌నీసం ప్ర‌జ‌ల ప్రాథమిక హ‌క్కులు కూడా అడ్డుకుంటారా ? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇక ర‌ఘురామ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేసిన వ్యాఖ్య‌ల‌కు ఎంపీ మిథున్ రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. ఎంపీ ర‌ఘురామ‌పై సీబీఐ కేసులు ఉన్నాయ‌ని.. వాటి నుంచి బ‌య‌ట ప‌డేందుకే ఆయ‌న ప్ర‌య‌త్నాలు చేస్తున్నారంటూ ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు. ర‌ఘురామ అధికార పార్టీ (బీజేపీ) లో చేరేందుకు త‌హ‌త‌హ లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.

ర‌ఘురామ‌పై ఇప్ప‌టికే ఉన్న సీబీఐ కేసుల ద‌ర్యాప్తును వేగ‌వంతం చేయాల‌ని ఆయ‌న కోరారు. ర‌ఘురామ‌కు మిథున్ రెడ్డి కౌంట‌ర్ ఇస్తుంటే వైసీపీ ఎంపీలు కూడా ఆయ‌న‌తో గ‌ళం క‌లిపారు. ఆ వెంట‌నే ర‌ఘురామ తిరిగి వైసీపీ ఎంపీల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. త‌న‌పై కేవ‌లం రెండు సీబీఐ కేసులు మాత్ర‌మే ఉన్నాయ‌ని.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై 100 సీబీఐ కేసులు ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. దీంతో లోక్‌స‌భ‌లో ఒక్క‌సారిగా గంద‌ర‌గోళం నెల‌కొంది.
Tags:    

Similar News