``వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే.. రాష్ట్రంలో మన అధికారానికి తిరుగు లేదు. మనం అనేక పథకాలకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ మాత్రం ఖర్చు చేయలేమా?``- ఇదీ వైసీపీ సీనియర్ల నోటి నుంచి వస్తున్న తాజా మాట. ప్రస్తుతం ఇది గుసగుసగానే విని పిస్తున్నప్పటికీ.. దీని వెనుక చాలా రీజన్ ఉందని అంటున్నారు. ఒకప్పుడు వివిధ ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి రైతు బాంధవుడిగా నిలిచిపోయారు. ఆయన మరణం తర్వాత కూడా ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారు. అయితే.. వీటిలో చాలా వరకు ప్రాజెక్టులు నిలిచిపోయాయి.
వీటిని కనుక ఇప్పుడు జగన్ పూర్తి చేస్తే.. పూర్తిస్థాయిలో తన తండ్రి పేరు నిలబెట్టడంతోపాటు.. రైతులకు మరింత మేలు చేసిన వారిగా గుర్తిండిపోయి.. రాష్ట్రంలో మరో 20 ఏళ్లపాటు అధికారంలో ఉండడం ఖాయమనేది వైసీపీ సీనియర్ల వాదన. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు బ్యారేజీ - సంగం బ్యారేజీ - అవుకు టన్నెల్-2 - వెలిగొండ టన్నెల్ 2 - వెలిగొండ టన్నెల్ 1 - వంశధార-నాగావళి లింకు - వంశధార రెండో దశలో రెండో భాగం వంటివి పూర్తిచేస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా నీరు పారి.. ఆంధ్రప్రదేశ్ హరిత ప్రదేశ్‌గా మారుతుందనేది నీటిపారుదల నిపుణులు సైతం చెబుతున్న మాట.
ఆయా ప్రాజెక్టులు అన్నీ కూడా వైఎస్ హయాంలోనే రూపు దాల్చాయి. అయితే.. ఆయన అకాల మరణం.. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును, పట్టిసీమను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఇవి ముందుకు సాగలేదు. ఈ మొత్తం ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తే.. చాలునని ప్రస్తుత అధికారులు సైతం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకటి రెండు సంక్షేమ పథకాలను ఆపైనా సరే.. వీటిని పూర్తి చేయడం ద్వారా.. రాష్ట్రంలో చిరకాలం పార్టీపేరు, సీఎం పేరు నిలుపుకొనే అవకాశం ఉందని పార్టీ నేతలు అంటున్నారు. దీనిపై త్వరలోనే సీఎంను కలవాలని ఒకరిద్దరు నేతలు నిర్ణయించుకోవడం గమనార్హం.