చంద్రబాబును ప్రతిపక్షం నుంచి తప్పిస్తే వైసీపీకి కిరీటం ఏమైనా వస్తుందా?

Update: 2020-09-07 14:50 GMT
ఎంతసేపు చంద్రబాబు కుర్చీ లాగేయాలని మాత్రమే వైసీపీ నేతలు చూస్తున్నారా? ఆయన కిందపడితే ఎవరికి లాభం.. నవ్వి ఊరుకుంటారు.కానీ వైసీపీకి ఏం లాభం అన్నది ఇక్కడ ప్రశ్న. ఆయనను లాగే ప్రయత్నాలు మాని 151మంది ఎమ్మెల్యేలను కాపాడుకొని వారికి నిధులు, విధులు ఇస్తే వైసీపీ మరింత పటిష్టం అవుతుందని విశ్లేషకులు సూచిస్తున్నారు.

ఎన్నికల ముందు ఉన్న సోషల్ ఇంజినీరింగ్ వైసీపీలో ఇప్పుడు లేదు అని అంటున్నారు. ఎంత సేపు చంద్రబాబును తప్పించాలనే చూస్తున్నారంటున్నారు. ఇప్పటికే ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. ఆ మూడు నియోజకవర్గాల్లో తిట్టుకొని తన్నుకొనే పరిస్థితి ఉంది. ఇంకొక ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను లాగేస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా పోతుందని ఫిరాయించిన టీడీపీ వాళ్లు అంటారు. కానీ దానివలన వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎంత నష్టపోతారనేది ఆలోచించడం లేదు. ఈ ఆలోచన లేకుండా జగన్ కు తప్పుడు సలహాలు ఇస్తున్నారని చెప్తున్నారు.

టీడీపీకి ఉన్న 23మంది ఎమ్మెల్యేల్లో 21 మందిని లాగేస్తే చంద్రబాబు, బాలక్రిష్ణ తప్పితే అంతా ఖాళీ అవుతుంది. వాళ్ల ఓటు బ్యాంకు తగ్గుతుందా? లేదా అన్నది ఇక్కడ ప్రశ్న.. తాత్కాలికంగా సైలెంట్ అవుతారు కానీ.. వైసీపీలో ఇంకా ఎక్కువ గలాబాలు అవుతాయంటున్నారు. ఇది వైసీపీకి ప్లస్ ఏమీ కాదు అని వైసీపీ వాళ్లే అంటున్నారు.

ఆ రోజు చంద్రబాబు చేసిన తప్పే ఇప్పుడు వైసీపీ చేస్తోందని.. అలా చేయకుండా 151మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్లకు అందరికీ అభివృద్ధి నిధులు ఇచ్చి నియోజకవర్గాలు బాగు చేస్తే బాగుంటుందని అంటున్నారు.టీడీపీ వాళ్లను వైసీపీలోకి చేర్చుకుంటే నియోజకవర్గాలు బాగుపడవు అని జగన్ కు సూచిస్తున్నారు. మంచి సీఎంగా జగన్ ఉండాలంటే ఎమ్మెల్యేలకు ఫండ్స్ ఇస్తే వాళ్లు బాగు చేసుకొని సీఎంకు మంచి పేరు తెస్తారని మేధావులు అంటున్నారు.
Tags:    

Similar News