మూడు జిల్లాల మ‌నసు దోచేదెవ‌రు..?

Update: 2022-10-13 14:30 GMT
ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాలు అన్నీ కూడా.. మూడు జిల్లాల చుట్టూనే తిరుగుతున్నాయి.అమ‌రావతి రాజ‌ధాని రైతులు చేప‌ట్టిన పాద‌యాత్ర 2.0 ఇప్పుడు తూర్పుగోదావ‌రిలోకి ప్ర‌వేశించ‌డం.. వైసీపీ నేత‌లు అడుగ‌డుగునా.. అడ్డు ప‌డ‌డం.. విశాఖ‌ను రాజ‌ధాని చేయాల్సిందేనని ప‌ట్టుబ‌ట్ట‌డం.. వంటి ప‌రిణామాలు గ‌మ‌నిస్తే.. వైసీపీ దూకుడుతోఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు.. ఆలోచ‌న‌లో ప‌డ్డార‌నేది వాస్త‌వం. సాధార‌ణంగా పాద‌యాత్ర‌పై సింప‌తీ ఉంటుంది. అది రాజకీయ‌న నేత‌లు చేసినా.. ప్ర‌జాస్వామ్య వాదులు చేసినా.. ఒకే రిజల్ట్ వ‌స్తుంది.

ఈ నేప‌థ్యంలో వైసీపీ దూకుడు పెంచింది. ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు ఎక్క‌డ పాద‌యాత్ర‌కు ప‌డిపోతారో.. అనుకున్న కీల‌క నేత‌లు.. అధిష్టానం ఆలోచ‌న మేర‌కు.. రంగంలోకిదిగారు. ఇక‌, టీడీపీ కూడా.. ఈ క్ర‌మంలో దూకుడు పెంచేందుకు రెడీ అయింది. ఉత్త‌రాంధ్ర‌ను తాము ఎలా అభివృద్ధి చేసిందీ వివ‌రించ‌నుంది. అదేస‌మ‌యంలో విశాఖ‌ను రాజ‌ధానిగా ప్ర‌క‌టిస్తున్న వైసీపీ నేత‌లు..ఇక్క‌డ దోచుకునేందుకు వ‌స్త‌న్నార‌ని కూడా చెప్పేందుకు టీడీపీ నేత‌లు స్కెచ్ సిద్ధం చేసుకున్నారు.

ఇక‌, జ‌న‌సేనాని ప‌వ‌న్ కూడా ఇక్క‌డ ప‌ర్య‌టించ‌నున్న‌ట్టు పార్టీ ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే వైసీపీ చేసిన గ‌ర్జ‌న ప్ర‌క‌ట‌న‌పై ప‌వ‌న్ స్పందించారు. దేనికోసం ఈ గ‌ర్జ‌న అంటూ.. ఆయ‌న ప్ర‌శ్నించారు.

అయితే.. ఈ మొత్తం వ్య‌వ‌హారాన్ని ప‌రిశీలిస్తే.. అస‌లు.. అటు ప్ర‌తిప‌క్షాలు కానీ, ఇటు.. వైసీపీ కానీ.. ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల మ‌నోభావాలు ఏంటి?  వారు ఏం కోరుకుంటున్నార‌నే విష‌యాల‌ను ప‌ట్టించుకున్నారా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.  ఎందుకంటే.. వైసీపీ చెబుతున్న అభివృద్ధి కానీ, టీడీపీ చెబుతున్న దోపిడీ కానీ.. ఇక్క‌డి ప్ర‌జ‌ల మెద‌ళ్ల‌లోకి చేరిందా? అనేది ప్ర‌శ్న‌.

ప్ర‌స్తుతం ఇక్క‌డ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ప్ర‌జ‌ల‌కు ఏమీ అర్ధం కావ‌డం లేద‌ని అంటున్నారు. రాజ‌ధాని వ‌స్తే.. అభివృద్ధి సాధ్య‌మ‌న్న‌.. వైసీపీ చెబుతున్న విష‌యాన్ని కానీ, వైసీపీ నేత‌లు.. విశాఖ‌ను దోచుకునేందుకు వ‌స్తున్నార‌న్న ప్ర‌తిప‌క్షాల వ్యాఖ్య‌ల‌ను  కానీ.. ఇక్క‌డి ప్ర‌జ‌లు చ‌ర్చించుకోవ‌డం లేదు.

కేవ‌లం.. త‌మ‌కు ఉపాధి చూపించాల‌ని.. పొరుగు రాష్ట్రాల‌కు వెళ్లే దుస్థితిని త‌ప్పించాల‌ని.. కీల‌క‌మైన వైద్య సేవ‌లు అందుబాటులోకి తీసుకురావాల‌ని మాత్ర‌మే వారు కోరుతున్నారు. మ‌రి ప్ర‌జ‌ల మ‌నసు తెలుసుకోకుండా.. రాజ‌కీయ పార్టీలు చేస్తున్న ఈ విన్యాసం ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News