ఈ ప్ర‌శ్న‌లు ప‌వ‌న్‌ను ఏమీ చేయ‌లేవు... మ‌న‌కే బొక్క‌: నానీ వ్యాఖ్య‌ల‌పై వైసీపీ గుస‌గుస‌!

Update: 2023-01-13 12:30 GMT
మాజీ మంత్రి పేర్ని నాని.. తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్వ‌హించిన 'యువ‌శ‌క్తి' స‌భ‌లో ఆయ న చేసిన వ్యాఖ్య‌ల‌పై కౌంట‌ర్లు ఇచ్చారు. స‌రే.. రాజ‌కీయంగా ఒక‌రు వ్యాఖ్య‌లు చేయ‌డం.. మ‌రొక‌రు కౌంట‌ర్లు ఇవ్వ‌డం కామ‌నే క‌దా! కానీ, ఎన్ని కౌంట‌ర్లు ఇచ్చినా.. త‌న స్వ‌ప‌క్షాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే ప‌రిస్థితి లేకుండా చూసుకోవాల్సిన అవ‌స‌రం  పార్టీ నాయ‌కుల‌కు ఉంటుంది.

కానీ, ఈ విష‌యంలో పేర్ని నాని ఒకింత వైసీపీని అడ్డంగా బుక్ చేసేలా వ్య‌వ‌హ‌రించార‌ని.. సొంత పార్టీ నా య‌కులే చెబుతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లేద‌ని.. శ్రీకాకుళం జిల్లా కొన్ని ద‌శాబ్దాలుగా వెనుక‌బ‌డి పో యింద‌ని. ప‌వ‌న్ అన్నారు. విద్య‌, ఉద్యోగ‌, ఉపాధి రంగాల్లో సాధించింది ఏమీలేద‌ని అన్నారు. అయితే.. దీనికి కౌంట‌ర్‌గా పేర్ని నాని మాట్లాడుతూ.. 8 ఏళ్ల‌పాటు మోడీతో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగిన‌ప్పుడు.. చంద్ర‌బాబుతో క‌లిసి ఉన్న‌ప్పుడు ఇవి గుర్తుకు రాలేదా? అని ప్ర‌శ్నించారు.

''అప్పుడు నువ్వు ఏం పీకావ్‌?'' అని పేర్ని ప్ర‌శ్నించారు. అయితే.. ఎన్నిక‌ల ముందు.. ఇలాంటి కామెంట్లు సొంత పార్టీని ఇర‌కాటంలోకి నెట్టేవేన‌ని అంటున్నారు వైసీపీనాయ‌కులు.

ఎందుకంటే.. వారి వ‌ల్ల కాలేద‌నే వైసీపీకి ప్ర‌జ‌లు ల్యాండ్ స్లైడ్ విక్ట‌రీని క‌ట్ట‌బెట్టారు. మ‌రి  గ‌త మూడున్న‌రేళ్లుగా కేంద్రంతో క‌లిసి ఉంటున్నా రు. కేంద్రం అడిగిన రాజ్య‌స‌భ సీట్లు ఇస్తున్నారు. వారు చెప్పిన‌ట్టు చెత్త‌పై ప‌న్నేస్తున్నారు. రిజిస్ట్రేష‌న్ ధ‌ర‌లు పెంచారు.

మ‌రి ఇన్ని చేస్తూ..కేంద్రం నుంచి పోల‌వరానికి పెంచిన అంచ‌నాల మేర‌కు 57 వేల కోట్ల‌కు నిధుల‌ను ఒప్పించారా?  క‌నీసం.. హోదాపై ఒక్క‌మాట చెప్పించ‌గ‌లిగారా?  క‌డ‌ప ఉక్కు నిర్మాణం, విశాఖ మెట్రో, విశాఖ రైల్వే జోన్‌, విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌ను ఆప‌గ‌లిగారా? అని వైసీపీ నాయ‌కులే ప్ర‌శ్నించుకుంటు న్నారు. అంతేకాదు.. ఇప్పుడు ఈ అంశాల‌కు ప్ర‌జ‌ల్లోకి చ‌ర్చ‌కు వ‌స్తే.. ప‌వ‌న్ కు జ‌రిగే న‌ష్టం పెద్ద‌గా ఉండ‌ద‌ని అంటున్నారు.

ఎందుకంటే.. ఆల్రెడీ ప‌వ‌న్‌ ఓడిపోయాడు. సో.. మ‌రోసారి అలాంటి ప‌రిస్థితి వ‌చ్చినా.. పెద్ద‌గా చింతించా ల్సిన అవ‌స‌రం లేదు. కానీ, 151 స్థానాల్లో ఉన్న వైసీపీకి తేడా వ‌స్తే.. త‌లెత్తుకోలేని ప‌రిస్థితి వ‌స్తుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News