చంద్రబాబు అధికారంలోకి వస్తే.. అంటూ.. వైసీపీ సీనియర్ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలో చర్చకు దారితీశాయి. నిజానికి వైసీపీ అధినేత, సీఎం జగన్.. వైనాట్ 175 నినాదంతో ముందుకు సాగాలని పార్టీ నాయకులకు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ధర్మాన వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినా.. అంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
ఎందుకంటే.. పాజిటివ్ యాట్టిట్యూడ్ ఎప్పుడూ.. కూడా ప్రజలను ఆలోచనదిశగా నడిపిస్తుంది. చంద్రబా బు అసలు అధికారంలోకి వచ్చే అవకాశం లేదని సీఎం జగన్ పదే పదే చెబుతున్నారు. పార్టీ నాయకులకు కూడా ఇదే బోధిస్తున్నారు. ఈ క్రమంలో వైనాట్ 175 నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఇప్పుడు పార్టీ నాయకులు కూడా ఇదేసూత్రాన్ని ప్రచారం చేస్తున్నారు.
కానీ, పార్టీలైన్‌కు విరుద్ధంగా టీడీపీకి మేలు చేసేలా ధర్మాన వ్యాఖ్యానించడం.. సరికాదనే అభిప్రాయం వ్య క్తమవుతోంది. పైగా.. విశాఖ రాజధాని విషయంలో ఆయన ఎందుకో రెచ్చిపోతున్నారనే అభిప్రాయం కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ``నాయకులుగా మాకు కొన్ని సానుకూల పరిణామాలు ఉంటాయి. అదేసమయం లో ప్రజల్లోనూ సానుకూలత ఉందో లేదో తెలుసుకోవాలి. ఒక్కసారి మాట తూలితే.. ప్రజల్లో ఏదోతెలియని పాజిటివిటీని పెంచితే.. అది మానే అనర్థం`` అని ఒక కీలక నాయకుడు మీడియా ముందు వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. ధర్మాన వ్యాఖ్యలపైనా.. పార్టీ అధిష్టానం ఒకింత సీరియస్‌గానే ఉన్నట్టు తెలుస్తోంది. తన వ్యక్తిగత లబ్ధి లేక పోయినా.. చేసిన వ్యాఖ్యల పర్వవసానం మాత్రం పార్టీకి చేటు చేసేలా ఉందనే అభిప్రాయం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వినిపిస్తోంది. విశాఖను అందరూ రాజధాని చేయాలని కోరుకుంటు న్నారు. కానీ.. టీడీపీ గురించి మాత్రం ఇలా వ్యాఖ్యానించడం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చినా.. విశాఖను ప్రత్యేక రాష్ట్రం చేయాలని కోరతానంటే.. ధర్మాన ఆలోచన ఎలా ఉందో అర్ధం కావడం లేదని.. మరో మంత్రి సీదిరి అప్పల రాజు వ్యాఖ్యానించడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.