యడ్యూరప్ప మరో కుమారస్వామి అవుతారా?

Update: 2019-07-27 07:30 GMT
రాజకీయ అనిశ్చితి ఏర్పడిన పరిస్థితుల్లో కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడియూరప్ప నాల్గోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే సీఎంగా ఆయన ముందు ఎన్నో సవాళ్లు.. బాధ్యతలు ఉన్నాయి. తొలి సవాల్ మాత్రం అసెంబ్లీలో బల నిరూపణ చేసి ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే. ప్రస్తుతం బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ప్రభుత్వం బలం నిరూపించుకోవాలంటే మరో ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ – జేడీఎస్ లోని అసంతృప్త ఎమ్మెల్యేలు ఎవరికి మద్దతు ఇస్తారనే దానిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు.

గవర్నర్ విధించిన గడువు లోపు అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలి. లేనిపక్షంలో కుమారస్వామికి పట్టిన గతే యడియూరప్పకు కూడా తప్పదని చెబుతున్నారు. దీనికి తోడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు ప్రస్తుత సమస్యలపై దృష్టి సారించాలి. అంతేకాకుండా కేబినెట్ ఏర్పాటు, అసమ్మతి నేతల బుజ్జగింపులు, సొంత పార్టీలో అసమ్మతి సెగలు రాకుండా చూసుకోవడం. రైతుల రుణమాఫీ - బెంగళూరులో ట్రాఫిక్ సమస్య - నిరుద్యోగ సమస్య - ఉపాధి కల్పన - నేరాల తగ్గింపు తదితర విషయాల్లో కొత్త సీఎం యడియూరప్ప ఎలా వ్యవహరిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.

అధికారంలోకి రాగానే తొలి సంతకం రుణమాఫీపై చేస్తానని యడియూరప్ప ప్రగల్బాలు పలికారు. రైతు నాయకుడిగా పేరు ఉండే యడియూరప్ప జాతీయ - రాష్ట్రీయ - సహకార బ్యాంకుల్లోని అన్ని రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.లక్ష వరకు రైతులు - చేనేత కార్మికులందరికీ రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. ఏమేరకు అమలు చేస్తారో!


Tags:    

Similar News