బీజేపీ చేతులెత్తేసిందా ?!

Update: 2018-05-19 09:29 GMT
క‌ర్ణాట‌క శాస‌న‌స‌భ‌లో బ‌ల‌నిరూప‌ణ‌కు ముందే క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన య‌డ్యూర‌ప్ప చేతులెత్తేసాడా ? బ‌ల‌నిరూప‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ 15 రోజుల గ‌డువు ఇచ్చినా .. సుప్రీం కోర్టు ఈ రోజు సాయంత్రం వ‌ర‌కే స‌మ‌యం ఇవ్వ‌డం మూలంగా ఇత‌ర పార్టీల స‌భ్యుల‌ను కూడ‌గ‌ట్టుకోలేక పోయారా ? అంటే బెంగుళూరు వ‌స్తున్న ఊహాగానాలు నిజ‌మే అని అంటున్నాయి. బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గే అవ‌కాశాలు ఎలాగూ లేనందున య‌డ్యూర‌ప్ప రాజీనామాకు సిద్దం అవుతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.

మూడో సారి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేస్తున్న య‌డ్యూర‌ప్ప బ‌ల‌ప‌రీక్ష‌కు వెళ్లి భంగ‌ప‌డ‌డం కంటే రాజీనామా చేయ‌డం ఉత్త‌మం అని భావిస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఈ మేర‌కు 13 పేజీల సుధీర్ఘ ప్ర‌సంగాన్ని సిద్దం చేసుకున్నాడ‌ని చెబుతున్నారు. అయితే మొత్తం 221 మంది స‌భ్యుల‌కు గాను ఇప్ప‌టి వ‌ర‌కు 210 మాత్ర‌మే ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఇంకా 11 మంది స‌భ్యులు ప్ర‌మాణ స్వీకారం చేయాల్సి ఉంది. వీరు ఎక్క‌డ ఉన్నారు ? అన్న‌ది ఉత్కంఠ‌గా మారింది.

గాలి జ‌నార్థ‌న్ రెడ్డి సోద‌రుడు గాలి సోమ‌శేఖ‌ర‌రెడ్డి ఇంత వ‌ర‌కు స‌భ‌కు రాలేదు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్ - ప్రతాప్ పాటిల్ లు క‌నిపించ‌ని నేప‌థ్యంలో బెంగుళూరులోని ఓ హోట‌ల్ లో సోమ‌శేఖ‌ర్ రెడ్డి స‌మ‌క్షంలో వీరు ఉన్నార‌ని భావిస్తున్నారు. మ‌ధ్యాహ్నం వీరిని తీసుకుని బ‌ల‌నిరూప‌ణ ప‌రీక్ష‌కు గాలి సోద‌రుడు వ‌స్తాడ‌ని భావిస్తున్నారు. అయితే త‌మ ఎమ్మెల్యేల‌ను అప్ప‌గించాల‌ని కాంగ్రెస్ ఆందోళ‌న‌లు చేస్తుంది. మ‌రికొద్ది గంట‌లు గ‌డిస్తే గానీ ఈ ఊహాగానాలు - ఉత్కంఠ‌కు తెర‌ప‌డదు.
Tags:    

Similar News